Jagityala: నగ్నంగా స్మశానవాటికలో యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో..!
ప్రపంచం సాంకేతిక పరంగా ఎంతో ముందుకెళ్తున్నా.. కొందరు మాత్రం మూఢనమ్మకాల మధ్యే జీవితం గడుపుతున్నారు. క్షుద్రపూజలు అంటూ స్మశానాల్లో తిరుగుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి స్మశానవాటికలో నగ్నంగా తిరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
ఓ ఊరిలో ఓ యువకుడు నగ్నంగా అర్ధరాత్రి స్మశాన వాటికలో తిరుగుతున్నాడు. శవాలను కాల్చిన చోట అతను నగ్నంగా నిలబడి పూజలు చేయడం, బూడిదని శరీరానికి రాసుకోవడం కనిపించింది. ఈ క్రమంలో నోటితో మంత్రలు కూడా చదువుతున్నాడు. అయితే అటుగా వెళ్తున్న కొందరు స్మశానవాటికలో ఓ నగ్నంగా పూజలు చేస్తున్న వ్యక్తిని చూశారు.

కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లాలో యువతులతో క్షుద్ర పూజలు చేసిన ముఠాను నల్లపాడు పోలీసులు అరెస్టు అదుపులోకి తీసుకున్నారు. తాడికొండ మండలం పొన్నెకల్లుకు నాగేశ్వరరావు, చిలకలూరిపేటకు చెందిన అరవింద అనే మహిళ గుప్త నిధుల కోసం సులభంగా డబ్బులు సంపాదించేందుకు క్షుద్ర పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు యువతలకు డబ్బు ఆశ చూపి వారిని నగ్నంగా కూర్చోబెట్టి పూజులు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications