మాజీ లవర్ తాజా గర్ల్ ఫ్రెండ్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య

ప్రేమించిన వాడు మోసం చేసినా భరించిన ఓ యువతి మాజీ ప్రేమికుడి గర్ల్ ఫ్రెండ్ వేధింపులు భరించలేకపోయింది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రేమికుడు మోసం చేసినా అతనికి దూరంగా ఉంటూ తన బతుకు తాను బతుకుతోంది. కానీ ఆమె మాజీ ప్రేమికుడి ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ మాత్రం నానా రకాలు వేధించింది. ఫోన్లు , మెసేజ్ లతో వేధింపులు మాజీ లవర్ తాజా గర్ల్ ఫ్రెండ్ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది.

మియాపూర్ లో చోటు చేసుకున్న ఈ విషాదకర సంఘటన లో అసలు వివరాల్లోకి వెళితే 23 ఏళ్ళ వయసున్న మునివెంకట అంజలి ఉమామహేశ్వరిది వైజాగ్‌. అంజలి అదే ప్రాంతానికి చెందిన జేజిబాబు ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత జేజిబాబు మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి అంజలి వైజాగ్‌లోని 4వటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఇక ఆ తర్వాత అక్కడ నుండి హైదరాబాద్ లోని అక్క ఇంటికి వచ్చి అక్క దగ్గరే ఉంటుంది అంజలి.

A young woman committed suicide with the harrasment of the Ex lovers present girl friend

మియాపూర్‌ ఆల్విన్‌ కాలనీలో నివసిస్తున్న అక్క వద్ద ఉంటున్నప్పటికీ జేజిబాబు ప్రియురాలు వసుంధర అంజలికి ఫోన్‌చేసి, మెసేజ్‌లు చేసి నిత్యం వేధిస్తోంది. ఇక ఈ వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. జేజిబాబు, అతడి కుటుంబసభ్యులతోపాటు వేధించిన యువతిపై మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+