నిశ్చితార్ధం చేసుకుందని కత్తెరతో దాడి చేసిన ప్రేమోన్మాది .. యువతికి తీవ్ర గాయాలు

తన ప్రేమను నిరాకరించిందని, వేరొకరితో పెళ్లికి సిద్ధమైందని ఆగ్రహించిన ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తెరతో దాడి చేశాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. తనను కాదని మరొకరితో నిశ్చితార్థం చేసుకుందనే ఆగ్రహంతో దాడికి పాల్పడిన ఈ సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

దర్జీ షాపులో పని చేసేవాడు .. ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురి

దర్జీ షాపులో పని చేసేవాడు .. ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురి

యూసుఫ్‌గూడ సమీపంలోని జవహర్‌నగర్‌లో ఉంటూ, ఆటో నడుపుతున్న ఓ వ్యక్తి కుమార్తె పదోతరగతి వరకు చదువుకుంది . ఇంట్లోనే ఉంటోంది. రెండేళ్ల క్రితం యూసుఫ్‌ అనే వ్యక్తి ఆ యువతి కుటుంబం ఉంటున్న భవనంలోనే కింది భాగాన్ని దర్జీ దుకాణం పెట్టుకోవడానికి అద్దెకు తీసుకున్నాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 25 ఏళ్ళ వై.దుర్గాప్రసాద్‌ ఆ దుకాణంలో పనికి కుదిరాడు. పని చేసుకుని జీవనం సాగించాల్సిన ఆ యువకుడు ప్రేమ పేరుతో ఒక యువతిని ఇబ్బందులకు గురి చేశాడు .

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు .. నో చెప్పిన యువతి

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు .. నో చెప్పిన యువతి

పదోతరగతి వరకు చదివిన అతడు పై అంతస్తులో ఉన్న యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు.బయటకు వెళ్లినపుడల్లా అనుసరిస్తూ, మాటలు కలిపేందుకు ప్రయత్నించేవాడు. ఆ యువతి అతడి ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించింది. అయినా దుర్గాప్రసాద్‌ పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధించేవాడు. ఈ నెల 2న ఆ యువతికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది.

దీంతో దుర్గాప్రసాద్‌ ఆమె నివాసానికి వెళ్లి మరొకరితో నిశ్చితార్థం చేసుకున్నావ్ అంటూ వాగ్వాదానికి దిగాడు.

కత్తెరతో దాడి ... యువతి అరవటంతో కాపాడిన స్థానికులు

కత్తెరతో దాడి ... యువతి అరవటంతో కాపాడిన స్థానికులు

ప్రేమోన్మాదంలో ఆమెపై కత్తెరతో దాడి చేశాడు. ఆమె చెవికి, గొంతు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి మధ్య తోపులాట చోటుచేసుకొంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో దుర్గాప్రసాద్‌ చేతికీ గాయమైంది. యువతి గట్టిగా కేకలు వేయడంతో దుకాణంలో ఉన్న యూసుఫ్‌ పరుగున పైకి వచ్చి దుర్గాప్రసాద్‌ను అడ్డుకొని యువతిని రక్షించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, యువతిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+