ఓటరు జాబితా నుంచి ఆధార్ డేటా తొలగించడానికి హైకోర్టు నో
హైదరాబాద్ : ఓట్ల తొలగింపు వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంటే .. ఓటరు జాబితా నుంచి ఆధార్ డేటా తొలగించడానికి హైకోర్టు తిరస్కరించింది. ఓటర్ల జాబితాకు అనుసంధానం చేసిన ఆధార్ డేటాను తొలగించాలనే ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణకు ఏ రకమైన సాప్ట్ వేర్ వినియోగిస్తున్నారో వివరిస్తూ కౌంటర్ వేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు ఈ నెల 11కి వాయిదా వేసింది.

సాఫ్ట్ వేర్ ద్వారా ఓట్ల తొలగింపు ..
ఓటర్ల జాబితాలో అవకతవకలపై గతేడాది కొడాలి శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలుచేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు ఈసీ ఒక ప్రత్యేకమైన సాప్ట్ వేర్ అభివృద్ధి చేసిందని .. దాని ఆధారంగా తెలంగాణలో 27 లక్షలు ఏపీలో 19 లక్షల ఓట్లను తొలగించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం, తెలుగు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ప్రజలను తప్పుదారి పట్టించాయని .. భారీగా అర్హుల ఓటర్లను తొలగించారని విన్నవించారు.

అనుమతి లేకుండా అలా ఎలా ఇస్తారు ?
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే .. ఏపీలో స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో ప్రజల వివరాలను సేకరించారని .. సర్వేలో ఆధార్ సంఖ్య ఓటర్లు గుర్తింపు కార్డు, ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, పాన్ కార్డు, కుటుంబసభ్యుల వివరాలు సేకరించి .. వాటిని స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ వద్ద భద్రపరిచారని చెప్పారు. తర్వాత ఆ డేటాను ఓటరు జాబితా రూపకల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినట్టు తెలిపారు. ఆధార్ సంఖ్యను కేవలం సబ్సిడీ పథకాలకే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని .. కానీ ప్రజల నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే ఆధార్ సమాచారాన్ని ప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చాయని పిటిషనర్ పేర్కొన్నారు.

సమాచారం ఇస్తే తప్పేంటీ ?
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన సమాచారాన్ని ఎన్నికల సంఘంతో పంచుకుంటే తప్పేంటనీ, దాని ప్రభావం ఓటరు జాబితా రూపకల్పనపై ఎలా పడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. జాబితాలో తొలగింపులు, చేర్పులు వంటివి ఈఆర్ వో చూస్తారని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. ఈసీ వద్ద ఉన్న డేటా చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా .. మూడో వ్యక్తితో పంచుకునే ప్రసక్తే లేదని తెలిపారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications