ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎయిర్పోర్ట్ నిర్మాణం పైన కీలక అడుగు పడింది. దశాబ్దాల కాలంగా ఓరుగల్లు వాసుల కల అయిన మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. 2027 చివరి నాటికి ఇక్కడ విమాన సర్వీసులను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి పనుల వేగం పెంచింది.
ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నిట్ సహకారం కోరిన ఏఏఐ
వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ సపోర్ట్ మరియు సూపర్వైజింగ్ ను వరంగల్ నిట్ కు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్పగించింది. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావలసిన పూర్తి భూసేకరణ చేసి ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర ప్రభుత్వం అందజేయగా ఈ మేరకు తదుపరి చర్యలలో భాగంగా టెక్నికల్ సపోర్ట్ మరియు సూపర్వైజింగ్ చేయాలని ఎయిర్ పోర్టు నిర్మాణానికి నిట్ సహకారాన్ని కోరింది.

ఎయిర్పోర్ట్ స్థలాన్ని సందర్శించిన నిట్ ప్రొఫెసర్లు
ఈ మేరకు నిట్ ప్రొఫెసర్లు ఎయిర్పోర్ట్ స్థలాన్ని సందర్శించి సర్వే ద్వారా జియో టెక్నికల్, ట్రాఫిక్ ప్రోటోకాల్ అంశాలు, భవనాల డిజైన్లు, రన్ వే నిర్మాణ ప్లాన్ లను పరిశీలించారు.ఆధునిక ప్రమాణాలతో మామునూరు ఎయిర్పోర్ట్ ను పునర్నిర్మించాలని భావిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనుల వేగాన్ని పెంచుతున్నాయి. 950 ఎకరాలలో ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేయడానికి సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావలసిన భూమిని అప్పగించింది.
850 కోట్ల రూపాయల బడ్జెట్ తో మామునూరు ఎయిర్ పోర్ట్
850 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ ఎయిర్పోర్టును నిర్మించ తలపెట్టిన ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్టులో ఆధునిక టెర్మినల్ భవనాన్ని, రన్ వే విస్తరణను, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఫైర్ ఫైటింగ్ సదుపాయాలను కల్పించనుంది. 2027 చివరినాటికి ఈ ఎయిర్ పోర్ట్ నుండి విమాన సర్వీసులను రన్ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.
ఉత్తర తెలంగాణా ప్రగతికి ఊతంగా మారనున్న ఎయిర్ పోర్ట్
ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయితే ఇది వరంగల్ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారనుంది. వరంగల్ ఐటి మరియు టెక్స్టైల్ హబ్ గా ఎదగడానికి ఇది దోహదం చేస్తుంది. వరంగల్ నగరంలోని పెట్టుబడులు, పరిశ్రమలు పెరిగే అవకాశం ఉంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో పాటు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇది ఉత్తర తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఊతంగా మారుతుంది.












Click it and Unblock the Notifications