చిట్టా పెద్దదే: ఏసీబీకి చిక్కిన మరో ఎక్సైజ్ అధికారి, కోట్లు కూడబెట్టాడు..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అవినీతి అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌(డిస్టిలరీస్‌) అదవల్లి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

ఆదాయానికిమించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారం మేరకు హైదరాబాద్‌, కరీంనగర్‌లోని శ్రీనివాసరెడ్డి ఇల్లు, స్నేహితులు, బినామీల ఇళ్లపై బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

 శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలు:

శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలు:

ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌ సెవెన్‌ హిల్స్‌ అపార్ట్‌మెంట్‌లోని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌ నేతృత్వంలో అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో కోట్ల విలువ చేసే ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, లక్షల్లో బ్యాంకు బ్యాలెన్సులు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పత్రాలు, 60 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఐదున్నర కోట్ల పైనే:

ఐదున్నర కోట్ల పైనే:

మార్కెట్‌ రేటు ప్రకారం ఏసీబీ గుర్తించిన ఆస్తుల విలువ రూ.5.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. తనిఖీల్లో లభించిన పత్రాలను బట్టి తన అక్రమ సంపాదనను శ్రీనివాసరెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టినట్టు గుర్తించారు.

 కరీంనగర్ లోను:

కరీంనగర్ లోను:

కరీంనగర్ జిల్లాలోని శ్రీనివాస రెడ్డి తండ్రి, సోదరుని ఇంట్లోను భారీ నగదు గుర్తించారు. జిల్లాలోని రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఉన్న శ్రీనివాసరెడ్డి తండ్రి ఇంట్లో, కరీంనగర్‌లోని సోదరుడి ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.50 లక్షల మేర ఆస్తులు గుర్తించారు.

 ఇదీ ఆస్తుల లెక్క:

ఇదీ ఆస్తుల లెక్క:

ఓల్డ్‌బోయిన్‌పల్లి రామరాజునగర్‌లో రూ.25 లక్షల విలువైన ఫ్లాట్‌

మేడ్చల్‌ పేట్‌బషీరాబాద్‌లో రూ.7.15 లక్షల విలువైన ఇంటి స్థలం
మేడ్చల్‌ పేట్‌బషీరాబాద్‌లో రూ.35.76 లక్షల విలువైన జీ ప్లస్‌ 4 ఇల్లు

హస్మత్‌పేట్‌లో రూ. 22 లక్షల విలువైన ఇంటిస్థలం
జీడిమెట్లలో రూ. 7.11 లక్షల విలువైన ఇంటిస్థలం
మామగారి ఊరిలో 25 లక్షల విలువైన ఇల్లు

మేడ్చల్‌ పేట్‌బషీరాబాద్‌లో రూ.1.04 లక్షల విలువైన ఇంటి స్థలం
మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో రూ.5.20 లక్షల విలువైన 3.5 ఎకరాల వ్యవసాయ భూమి
కరీంనగర్‌లో రూ.4 లక్షల విలువైన 12 ఎకరాల మామిడితోట
రూ.8 లక్షల విలువైన కారు.

రూ.17.50 లక్షల విలువైన కిలో బంగారు ఆభరణాలు
రూ.5.88 లక్షల బ్యాంకు బ్యాలెన్స్‌, రూ.3.3 లక్షల ఇన్సూరెన్స్‌ ప్రీమియంతోపాటు రూ.2.50 లక్షల విలువైన గృహోపకరణాలు

 అక్కడ పనిచేసినప్పుడే:

అక్కడ పనిచేసినప్పుడే:

గతంలో మేడ్చల్‌ ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌గా శ్రీనివాసరెడ్డి మూడేళ్లు పనిచేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాలతోనే అక్రమాలకు పాల్పడ్డాడు. ఏసీబీ అధికారులు శ్రీనివాసరెడ్డిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

కాగా, ఎక్సైజ్‌ శాఖలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ గతంలో అంతర్గత విచారణ జరిపించారు. విచారణలో 84 మంది అవినీతి అధికారులను గుర్తించి ఆరు నెలల క్రితం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ నివేదిక ప్రకారమే తాజా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Adavalli Srinivasa Reddy, An assistant commissioner of the distilleries wing of the department of prohibition and excise, has been nabbed and assets disproportionate

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి