రామగుండం ఓపెన్‌​కాస్ట్‌ గనిలో ప్రమాదం: మట్టి పెళ్లలు పడి ఇద్దరు మృతి

పెద్దపల్లి: రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనిలో బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. పైప్‌లైన్ లీకేజీని అరికట్టేందుకు నలుగురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి పెళ్లలు మీదపడ్డాయి. దీంతో మట్టిో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్‌గా గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Accident in Ramagundam Mine Two workers killed

క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) మండలం బొప్పారంలో విషాద ఘటన చోటు చేసుకుంది. క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి చెందారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శ్రీపాల్ రెడ్డి, రాజు స్నేహితులు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్ గా, రాజు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు.

కాగా, మంగళవారం వీరిద్దరూ ఓ విందు కార్యక్రమానికి తమ కుటుంబసభ్యులతో కలిసి బొప్పారం వచ్చారు. బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన 12 ఏళ్ల కుమార్తె.. క్వారీ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాజు కుమార్తె ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడిపోయింది. గంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్ రెడ్డి అందులో దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ముగ్గురి మృతితో వారి కుటుంబాలతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+