చేవెళ్ల వద్ద హైదరాబాద్- తాండూర్ TGSRTC బస్సు నుజ్జునుజ్జు- 18 మంది స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 20 మందికిపైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ ల ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఈ తెల్లవారు జామున జిల్లాలోని చేవెళ్ల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి తాండూరుకు బయలుదేరి వెళ్తోన్న టీజీఎస్ఆర్టీసీ బస్సు నంబర్ టీఎస్ 34 టీఏ 6354 ఎక్స్ ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది. ఖానాపూర్ గేట్ సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చిన నంబర్ టీజీ 06 టీ 3879 భారీ టిప్పర్ బస్సును వేగంగా ఢీకొట్టింది. కంకర లోడ్ తో వెళ్తోన్న టిప్పర్ అది.

బస్ డ్రైవర్ హారన్ మోగిస్తూ, హెడ్ లైట్లను వెలిగిస్తూ హెచ్చరిస్తోన్నప్పటికీ రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. టిప్పర్ ను తప్పించడానికి డ్రైవర్ కుడి వైపు బస్సును తిప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి బస్సు కుడి వైపు భాగం మొత్తం కోసుకుపోయింది. బస్సు ముందు భాగం, డ్రైవర్ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్, ప్రయాణికులను వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.
ఢీకొట్టిన తర్వాత టిప్పర్ బస్సుపై వాలిపోయింది. అందులో ఉన్న కంకర మొత్తం బస్సులో పడింది. దాని మధ్య పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. 18 మంది సంఘటన స్థలంలోనే మరణించారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ ల ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
— oneindiatelugu (@oneindiatelugu) November 3, 2025
ఆర్టీసీ బస్సు- టిప్పర్ లారీ ఢీకొనడంతో 21 మంది మృతి
గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్, డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు#RoadAccident #RangaReddy #Telangana #ViralWatch #Oneindia #OITelugu pic.twitter.com/k51rkVJSOb
క్షతగాత్రుల్లో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలం మొత్తం హాహాకారాలతో నిండిపోయింది. చలిలో, ఒంటికి తాకిన గాయాలతో ప్రయాణికులు రోడ్డు పక్కన రోదిస్తూ కనిపించారు. అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్లతో సంఘటన స్థలం మొత్తం భీతావహంగా మారింది. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications