సూర్యాపేట జిల్లాలో ప్రమాదం
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో డిజిల్ టాంకర్ బోల్తా పడిండి. ఈ ఘటనలో టాంకర్లో ఉన్న బయో డిజిల్ అంతా నేలపాలైంది. కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న AP 37TB 3429 అనే నెంబర్ గల ట్యాంకర్ చివ్వెంల మండలం బీబిగుడెం వద్ద ఆటోని తప్పించబోయి టాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లో ఉన్న బయో డిజిల్ మొత్తం నేలపాలయింది. ఈ డిజిల్ విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. అయితే ట్యాంకర్ కింద పడి లబోదిబోమంటున్న ట్యాంకర్ యాజమాన్యానికి వారి కళ్ల ముందే బీబిగుడెం గ్రామస్తులు బయో డిజిల్‌ను పోటీలు పడి మరీ ఎత్తు కెళ్తుంటే వారు ఎమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అంతేకాక డిజిల్ కోసం గ్రామస్థులు పోటీలు పడ్డారు. కింద పోయిన డిజిల్‌ను క్యాన్లలో నింపుకొని వెళ్ళారు.












Click it and Unblock the Notifications