స్త్రీపై యాసిడ్, మద్యం తేలేదని భార్యతో కల్సి కొట్టాడు
హైదరాబాద్: పంజాగుట్ట నుంచి అమీర్‌పేట వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఇరవై ఒక్కేళ్ల యువతి పైన గుర్తు తెలియని దుండగులు యాసిడ్ పోశారు. అదృష్టవశాత్తు యాసిడ్ యువతికి కొంత ఎడంగా పడడంతో ప్రమాదం తప్పింది.
వరంగల్ జిల్లాకు చెందిన యువతి అమీర్‌పేట హాస్టల్‌లో ఉంటూ పంజాగుట్టలో ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తోంది. రోజులానే సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో విధులు ముగించుకుని హాస్టల్‌కు నడుచుకుంటూ వెళ్తోంది.
ఈ క్రమంలో ఆటోలో వచ్చిన ఓ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అమీర్‌పేట బిగ్ బజార్ సమీపంలో యువతిపై యాసిడ్ దాడికి యత్నించారు.

యాసిడ్ యువతి మోచేయిపై రెండు చుక్కలు పడింది. భయాందోళనకు గురైన యువతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు.
మద్యం తేలేదని బాలుడిపై దాష్టీకం
మద్యం తీసుకురమ్మంటే తీసుకు రాలేదనే కోపంతో ఓ రౌడీషీటర్ ఓ బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు. ఈ సంఘటన హైదరాబాదులోని అడ్డగుట్ట ప్రాంతంలో జరిగింది. రాజు, మహేష్, వేణు, బాలరాజులు ఆరో తరగతి, ఇంటర్ చదువుతున్నారు.
వారికి స్థానిక రౌడీషీటర్ మద్యం తీసుకు రమ్మని చెప్పాడు. వారు మాట వినకపోడవంతో గదిలో బంధించి, తన భార్య, మరో ఇద్దరితో కలిసి చితకబాదాడు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications