రవితేజ గురించి అడిగితే..: డ్రైవర్ కీలక సమాచారం, ఆ సినీ స్టార్‌లకు చిక్కులేనా?
సిట్ విచారణలో నటుడు రవితేజ డ్రైవర్ శ్రీనివాస రావు నుంచి కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది. విచారణలో భాగంగా శ్రీనివాస రావును ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు విచారించారు.
హైదరాబాద్: సిట్ విచారణలో నటుడు రవితేజ డ్రైవర్ శ్రీనివాస రావు నుంచి కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది. విచారణలో భాగంగా శ్రీనివాస రావును ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు విచారించారు.
చదవండి: నవ్వుతూ వెళ్లి, డల్‌గా రవితేజ: పూరీనే అంటే ఎలా, ఆ ప్రశ్న ఎక్కడిది.. సిట్‌కు ధీటుగా
అధికారులు అడిగిన ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం చెప్పారని తెలుస్తోంది. పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి? ఎవరి ద్వారా వస్తున్నాయి? డ్రగ్స్ వాడుతున్న వారు ఎవరెవరు?.. ఇలా పలు వివరాలు చెప్పాడని అంటున్నారు.

రవితేజ, భరత్‌లకు డ్రగ్స్ అందించేవాడా అంటే?
రవితేజ, ఆయన సోదరుడు భరత్‌కు డ్రగ్ అందించేవాడివా అని అడిగితే మౌనం వహించాడని సమాచారం. ఎక్కడి నుంచి వచ్చేవి, బ్యాంకాక్ పార్టీలకు రవితేజతో కలిసి వెళ్లేవాడివా అని అడిగినా సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. రవితేజ గురించి పలు కోణాల్లో, పలు ప్రశ్నలు సంధిస్తే.. తనకు తెలిసింది చెప్పానని శ్రీనివాస రావు అన్నాడని తెలుస్తోంది.

ఇద్దరు సినీ ప్రముఖులు బుక్
డ్రగ్స్ కేసులో ఇద్దరు సినీ ప్రముఖులు అడ్డంగా బుక్కైపోయినట్లుగా ప్రచారం సాగుతోంది. వారిద్దరు బాధితులే కాదని, నిందితులు అని గుర్తించే సాక్షాలను సిట్ గుర్తించిందని తెలుస్తోంది. వారిపై ఆరు సాక్ష్యాలు ఉన్నట్లుగా సమాచారం.

అది తేల్చే ప్రయత్నంలో సిట్
వారిపై ఎన్డీపీఎస్ 1985 చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోందని ప్రచారం సాగుతోంది. డ్రాఫ్ట్ కాఫీ సిద్ధమవుతోందని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. తాము గతంలో డ్రగ్స్ వాడామని, ఇప్పుడు మానివేశామని నలుగురు సినీ ప్రముఖులు చెప్పారని తెలుస్తోంది. మిగతా వారు అలావాటు లేదన్నారు. దీంతో డ్రగ్ సరఫరాదారులు ఎవరు, వాడినవారు ఎవరో సిట్ తేల్చాలని భావిస్తోంది.

అతను అలవాటు చేసే ప్రయత్నం
ఓ సినీ ప్రముఖుడు తొలత తాను వాడి, ఆ తర్వాత పలువురికి అలవాటు చేసే ప్రయత్నం చేశాడని విచారణలో తేలిందని సిట్ గుర్తించిందని అంటున్నారు. తాము బ్యాంకాక్ వెళ్లినప్పుడు సదరు ప్రముఖుడికి తాను డ్రగ్స్ తెచ్చి ఇచ్చానని ఒకరు వాంగ్ములంలో చెప్పాడని తెలుస్తోందని ప్రచారం సాగుతోంది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications