నవ్వుతూ వెళ్లి, డల్‌గా రవితేజ: పూరీనే అంటే ఎలా, ఆ ప్రశ్న ఎక్కడిది.. సిట్‌కు ధీటుగా
హైదరాబాద్: సిట్ విచారణ నిమిత్తం ఉదయం నవ్వుతూ కార్యాలయానికి వచ్చిన నటుడు రవితేజ, తిరిగి వెళ్లే సమయంలో మాత్రం డల్‌గా, ముభావంగా కనిపించాడు.విచారణలో సిట్ అధికారులు కీలక విషయాలు రాబట్టారని తెలుస్తోంది. క
హైదరాబాద్: సిట్ విచారణ నిమిత్తం ఉదయం నవ్వుతూ కార్యాలయానికి వచ్చిన నటుడు రవితేజ, తిరిగి వెళ్లే సమయంలో మాత్రం డల్‌గా, ముభావంగా కనిపించాడు.
చదవండి: 'రవితేజను అన్యాయంగా ఇరికిస్తున్నారు, షూటింగుల్లో ఇలా చెప్పేవారు'
విచారణలో సిట్ అధికారులు కీలక విషయాలు రాబట్టారని తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయిన రవితేజ... మరికొన్ని ప్రశ్నలకు ఘాటుగా సమాధానం చెప్పారని చెబుతున్నారు.

మీడియాతో మాట్లాడకుండా
విచారణ అనంతరం రవితేజ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఉదయం అతను ఎంతో హుషారుగా కార్యాలయానికి వచ్చాడు. నవ్వుతూ లోనికి వెళ్లాడు. సాయంత్రం ముభావంగా బయటకు వచ్చి, నమస్కరించుకుంటూ వెళ్లిపోయాడు. వేగంగా నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కాడు.
Recommended Video


రవితేజకు సిట్ ప్రశ్నలు ఇవేనంటూ ప్రచారం
కెల్విన్, పూరీ జగన్నాథ్, జిషాన్, చార్మీ తదితరులపై ప్రశ్నలు సంధించారు.
సిట్: కెల్విన్, జీషాన్ మీకు ఎన్నాళ్లుగా పరిచయం?
రవితేజ: కెల్విన్ నాకు తెలుసు, జీషాన్ ఎవరో తెలియదు.
సిట్: పూరీ సినిమా షూటింగ్‌ల సమయంలో ఎక్కెడెక్కడికి వెళ్లేవారు?
రవితేజ: ఏ సినిమాకయినా డైరెక్టర్ ఎక్కడ షూటింగ్ ప్లాన్ చేస్తే అక్కడికి వెళ్తాం. షూటింగ్ జరిగే సమయాల్లో అక్కడున్న గెస్ట్ హౌస్ లో బస చేస్తాం, హైదరాబాద్ లో అయితే ఇంటికెళ్తాం.
సిట్: విదేశాలకు వెళ్లినప్పుడు మీ అలవాట్లు ఏమిటి?
రవితేజ: ప్రత్యేకమైన అలవాట్లేవీ లేవు. ఇంటి పుడ్ వండించుకునే ఏర్పాట్లు చేస్తాను. డైట్ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉంటాను.

జిషాన్ తెలియదన్నప్పుడు ఆ ప్రశ్నే ఉండదు, డ్రగ్స్ అలవాటే లేనప్పుడు
సిట్: జీషాన్ తో పరిచయాలకు దారి తీసిన పరిస్థితులు ఏంటి?
రవితేజ: జీషాన్ తెలియదన్నప్పుడు ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు.
సిట్: ఈవెంట్, ఆడియో ఫంక్షన్లలో కెల్విన్‌కు మీతో పనేంటి?
రవితేజ: కెల్విన్ ఒక్కడే కాదు ఈవెంట్ సమయాల్లో చాలామందిని కలుస్తుంటా.
సిట్: డ్రగ్స్ మీరొక్కరే తీసుకునే వారా? ఇంకా సహచర నటులు ఎవరైనా ఉన్నారా?
రవితేజ: డ్రగ్స్ అలవాటే లేనప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగడం పద్ధతి కాదు.

పబ్బులకే వెళ్లను.. ఆ ప్రశ్న ఎక్కడిది, పూరీ ద్వారానే అందరు కాదు
సిట్: ఏఏ పబ్‌ల్లోకి ఎక్కువగా వెళ్లేవారు?
రవితేజ: పబ్‌లకు వెళ్లే అలవాటు నాకు లేదు. అలాంటప్పుడు ఏఏ పబ్బుల్లో అన్న ప్రశ్న సరికాదు.
సిట్: షూటింగ్ లేని సమయల్లో బ్యాంకాక్ లో ఎలాంటి పార్టీలు చేసుకుంటారు?
రవితేజ: యూనిట్ సభ్యులంతా కలిసి చిన్నపాటి పార్టీలు చేసుకుంటాం.
సిట్: ముమైత్, చార్మీ, పూరీ ద్వారా పరిచయం అయ్యారా?
రవితేజ: సినిమా రంగంలో చాలామంది స్నేహితులు ఉన్నారు. అందరూ పూరీ ద్వారానే పరిచయం అయ్యారంటే సరిగా ఉంటుందా? అంటూ రవితేజ సిట్ కు సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications