విలక్షణ నటుడు శరత్ బాబు మృతి పై క్లారిటీ ఇచ్చిన సోదరి

ప్రముఖ నటుడు శరత్ బాబు మృతి చెందాడంటూ వార్త వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తపై శరత్ బాబు సోదరి స్పష్టత ఇచ్చింది. శరత్ బాబు బతికే ఉన్నారని ఆయన మృతిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని ఆమె క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే శరత్ బాబు కోలుకుని అందరి ముందుకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

శరత్‌బాబు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఇతరత్రా అనారోగ్య సమస్యలు చోటుచేసుకోవడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్లు సమాచారం.శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. తెలుగు సినిమా చరిత్రలో విలక్షణమైన నటుడిగా గుర్తింపు పొందిన ఆయన తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ సినీ పరిశ్రమలలో నటించారు.

Legendary actor Sarath Babu passed away; Tragedy in Telugu film industry

మొత్తం 220 పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్ గా ను అనేక సినిమాలలో శరత్ బాబు విలక్షణ పాత్రలు పోషించారు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 1973లో రామరాజ్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన శరత్ బాబు చాలా హిట్ సినిమాలలో నటించారు.

రామరాజ్యం, కన్నె వయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, చిలకమ్మ చెప్పింది, నీరాజనం, సీతాకోకచిలుక, ఓ భార్య కథ, అన్వేషణ, ఇది కథ కాదు, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో సినిమాలలో శరత్ బాబు తన అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఆమదాలవలస లో జన్మించిన ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు. కానీ ఆయన కళ్ళ సమస్యల వల్ల పోలీస్ కాలేకపోయాడు.

ఆ తర్వాత ఓ పేపర్ లో ఆడిషన్ ప్రకటన చూసి సినిమా యాక్టర్ గా ఆడిషన్ కు వెళ్ళిన ఆయన ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వం వహించిన అవరుగల్ సినిమా ద్వారా మొదట తమిళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తెలుగులో ఇది కథ కాదు సినిమాగా బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆ సినిమాలో శరత్ బాబు, కమల్ హాసన్, చిరంజీవి, జయసుధ వంటి గొప్ప నటులతో కలిసి నటించారు.

ఆ సినిమాలో ఆయన వారికి దీటుగా తన నటనను ప్రదర్శించారు. ఆ తర్వాత ఆయన సినీ ప్రపంచంలో వెనక్కు తిరిగి చూడలేదు. ఆయన తన సినీ ప్రయాణంలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలను అందుకున్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితంలో మొదట రమాప్రభను పెళ్లి చేసుకున్నారు. ఆపై 1988లో ఆమెతో విడిపోయారు. మళ్ళీ శరత్ బాబు 1990 లో స్నేహా నంబియార్ ను పెళ్లి చేసుకున్నారు. ఆపై ఆమెకు 2011లో విడాకులు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+