‘గివ్ ఇట్ అప్’: ప్రధాని మోడీ పిలుపునకు స్పందించిన నటి అమల
హైదరాబాద్: అవసరం లేని వారు గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు ఇప్పటికే చాలా మంది స్పందించారు. ఇప్పుడు ఆ జాబితాలో పెటా ఉద్యమకర్త, నటి, ప్రముఖ సినీనటుడు నాగార్జున సతీమణి అక్కినేని అమల కూడా చేరిపోయారు.
ఈ మేరకు 'గివ్ ఇట్ అప్' దరఖాస్తుపై సంతకాలు చేసిన అమల, ఆ పత్రాలను ఆయిల్ కంపెనీ ప్రతినిధికి అందజేశారు. ఆమెతోపాటు కుటుంబసభ్యులు మరో ఐదుగురు కూడా 'గివ్ ఇట్ అప్' చేసినట్లు హైదరాబాద్ ఏరియా సేల్స్ మేనేజర్ ఉమాపతి తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఆమె సబ్సిడీని వదులకున్నారని తెలిపారు. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది సబ్సిడీని వదులుకోగా, అందులో తెలంగాణ హెచ్‌పీసీఎల్ వినియోగదారులు 13,420 మంది ఉన్నారని తెలిపారు.
అవసరం లేని వారు సబ్సిడీని వదులు కోవడం వల్ల పేదలకు ఇచ్చే సబ్సిడీలు పెంచవచ్చే ఆలోచనతో ప్రధాని నరేంద్ర మోడీ ‘గివ్ ఇట్ అప్' పిలుపునిచ్చారు. కాగా, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణులు సానియా మీర్జా, గుత్తా జ్వాలాలు కూడా గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు.
-
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న "త్రిష".."విజయ్" బాటలోనే పాలిటిక్స్ లోకి !! -
క్షమించండి.. మళ్లీ నోరు జారను !! -
OTT: దుమ్ములేపుతున్న కొత్త మూవీస్, ఈ వారం ఫుల్ లిస్ట్ ఇదే! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
అట్టర్ ఫ్లాప్ అనే టాక్‌తో మొదలై చివరకు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
లారీ ఎక్కి వెళ్లి కృష్ణ సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్












Click it and Unblock the Notifications