ఎవరా ఇద్దరు?: సిట్‌కు ముమైత్, పూరీతో చెడిందా?

డ్రగ్స్ కేసులో సిట్ అధికారులకు టాలీవుడ్ నటి ముమైత్‌ఖాన్ కీలక సమాచారాన్ని ఇచ్చింది.ఈ సమాచారం మేరకు అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ సోదాల తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని సిట్ .

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ అధికారులకు టాలీవుడ్ నటి ముమైత్‌ఖాన్ కీలక సమాచారాన్ని ఇచ్చింది.ఈ సమాచారం మేరకు అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ సోదాల తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.

ముమైత్ ఖాన్ ఓ తెలుగు టీవి చానల్ నిర్వహిస్తున్న షో నుండి నేరుగా హైద్రాబాద్ ‌కు వచ్చారు. ఆమె రాత్రిపూట హైద్రాబాద్‌కు వచ్చారు. హోటల్‌లో రాత్రిపూట బస చేసిన ముమైత్‌ఖాన్ ఇవాళ నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకొంది.

సిట్ కార్యాలయంలో విచారణ పూర్తైన తర్వాత ఆమె నేరుగా బయటకు వెళ్ళిపోయింది. అయితే ఉదయం పూట విచారణకు వచ్చే సమయంలో గంభీరంగా ఉన్న ముమైత్‌ఖాన్ తిరిగి వెళ్ళే సమయంలో మీడియాకు విక్టరీ సింబల్‌ను చూపుతూ వెళ్ళారు.

అయితే సినీ ప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులకు రోజుకో కొత్త సమాచారం వస్తోంది.ఈ సమాచారాల ఆధారంగా వారు విచారణ సాగిస్తున్నారు.అయితే వీటి ఆధారంగా మరికొందరిని విచారించడంతో పాటు అరెస్టుచేసే అవకాశాలు కూడ ఉన్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.

ఎవరా ఇద్దరు?

ఎవరా ఇద్దరు?

విచారణ సమయంలో ముమైత్‌ఖాన్ చెప్పిను ముజీబ్, నజీర్‌లు ఎవరనే చర్చ సర్వత్రా సాగుతోంది.ఈ ఇధ్దరి పేర్లను ముమైత్‌ చెప్పినట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచారం మేరకు వారిద్దరి ఇళ్ళళ్ళో సోదాలు నిర్వహిస్తున్నారు. మరింత కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో ఎక్సైజ్ అధికారులున్నారు. ఎక్కు ప్రశ్నలకు ఆమె పొడిపొడిగానే సమాధానాలను చెప్పారని తెలిసింది.

పూరీతో దెబ్బతిన్న సంబంధాలు?

పూరీతో దెబ్బతిన్న సంబంధాలు?

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ఆమెకు సంబంధాలు దెబ్బతిన్నాయనే ,ప్రచారం కూడ టాలీవుడ్ వర్గాల్లో సాగుతోంది.ఈ కారణంగానే ఆమెకు తెలుగులో ఇటీవల కాలంలో సినిమాల్లో అవకాశాలు కూడ తగ్గాయనే ప్రచారం కూడ ఉంది.అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తోందని సమాచారం. అయితే సినిమాలు లేని కారణంగానే ఆమె తన మకాన్ని తిరిగి ముంబైకి మార్చినట్టు సమాచారం. హైద్రాబాద్‌కు సంబంధాలు లేనేలేవు.డ్రగ్స్‌తో సంబంధాలు ఎలా ఉన్నాయని ఆమె ప్రశ్నిస్తున్నారు.ఇటీవల ఆమె సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు.

కెల్విన్ సంబంధాలపై విచారణ

కెల్విన్ సంబంధాలపై విచారణ

కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ముమైత్‌ఖాన్‌ను విచారించినట్టుగా సమాచారం. కెల్విన్ ఫోన్‌లో ముమైత్‌ఖాన్ నెంబర్ ఉంది. అంతేకాదు ఆయనతో వాట్సాప్ చాటింగ్ సమాచారాన్ని కూడ సిట్ అధికారలు సేకరించారు.అయితే ఈ సమాచారాన్ని తీసుకొని వారు విచారణ చేశారు.

కెల్విన్, జీషాన్‌ల సమాచారం ఆధారంగా విచారణ

కెల్విన్, జీషాన్‌ల సమాచారం ఆధారంగా విచారణ

ఇప్పటికే అరెస్ట్ చేసిన కెల్విన్, జీషాన్‌లు ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడ ముమైత్‌ను ప్రశ్నించారు. అంతేకాదు ఇప్పటివరకు విచారించిన సినీ ప్రముఖులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కూడ ముమైత్‌పై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. పూరీ జగన్నాథ్‌తో పాటు ఇతరులతో సంబంధాలు , సినిమాల్లో అవకాశాలపై కూడ ప్రశ్నించారు.

శాంపిళ్ళు ఇచ్చేందుకు నిరాకరణ

శాంపిళ్ళు ఇచ్చేందుకు నిరాకరణ

చార్మి మాదిరిగానే బ్లడ్ శాంపిళ్ళతో పాటు గోళ్ళు, వెంట్రుకల శాంపిళ్ళను ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. అయితే శాంపిళ్ళు తీసుకొనే విషయంలో విచారణకు హజరైన వారి అనుమతి తప్పనిసరి. దీంతో ఆమె నిరాసక్తతను వ్యక్తం చేయడంతో సిట్ అధికారులు కూడ ఏం చేయలేకపోయారు. చార్మికూడ ఇదే తరహలోనే శాంపిళ్ళు ఇచ్చేందుకు నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+