Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి..కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి!!

అదిలాబాద్ మాజీ ఎంపీ బిజెపి నేత రమేష్ రాథోడ్ కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లోని తన ఇంట్లో ఈరోజు ఉదయం ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆయనను ఆదిలాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించారు.

బీజేపీ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి
దీంతో హైదరాబాద్ కు తీసుకు వెళుతుండగా మార్గం మధ్యలో ఇచ్చోడ సమీపంలో రమేష్ రాథోడ్ కన్నుమూశారు. దీంతో రమేష్ రాథోడ్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన ఉట్నూరుకు తరలించారు. జూన్ 31 తేదీన రేపు రమేష్ రాథోడ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. ఇక రమేష్ రాథోడ్ రాజకీయ ప్రస్థానానికి వస్తే 1999 నుండి 2004 వరకు ఆయన ఖానాపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు.

Adilabad Former BJP MP Ramesh Rathod passed away Union Minister Bandi Sanjay is deeply shocked

రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి
2006 నుంచి 2009 వరకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశారు. 2009లో టిడిపి నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రమేష్ రాథోడ్ బిజెపిలో కొనసాగుతున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రమేష్ రాథోడ్ మరణం నమ్మలేకున్నా.. బండి సంజయ్
ఆదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా రమేష్ రాథోడ్ అందించిన సేవలు మరువలేనివని ఆయన పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రమేష్ రాథోడ్ చనిపోయారంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్న బండి సంజయ్ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

బీజేపీ నేతల సంతాపం
రమేష్ రాథోడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కల్పించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు, స్థానిక నేతలు కూడా రమేష్ రాథోడ్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+