గవర్నర్ జోక్యంతో సమ్మె విరమణ : సమస్యల పరిష్కార బాధ్యత : నేరుగా చర్చలకు ఆహ్వానించి..!

తెలంగాణ గవర్నర్ తమిళిసై జోక్యంతో క్యాబ్ డ్రైవర్లు సమ్మె విరమించారు. మస్యలు పరిష్కరించాలని రెండున్నర నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందించడం లేదని నిరసిస్తూ ఈనెల 19వ తేదీ నుంచి సమ్మెకు క్యాబ్‌, ట్యాక్సీ డ్రైవర్స్‌ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న పరిస్థితుల్లో క్యాబ్ డ్రైవర్లు సైతం సమ్మెలో ఉంటే ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేసారు. చెన్నై నుండి రాగానే గవర్నర్‌ తమిళిసై రంగంలోకి దిగారు.

చర్చలు జరిపి, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు సమ్మె విరమించేలా చేశారు. వారి సమస్యల పరిష్కార దిశగా తన వంతు బాధ్యత తీసుకుంటానంటూ హామీ ఇచ్చారు. సమ్మె విరమించమని కోరారు. దీంతో..ఆ వెంటనే తాము సమ్మె విరమిస్తున్నట్లుగా క్యాబ్ డ్రైవర్ల జేఏసీ ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని నేరుగా గవర్నర్ జోక్యంతో సమ్మె విరమించటం పైన అసక్తి కర చర్చ మొదలైంది.

జేఏసీతో నేరుగా చర్చలు జరిపిన గవర్నర్‌

జేఏసీతో నేరుగా చర్చలు జరిపిన గవర్నర్‌

తెలంగాణ ఆర్టీసీ సమ్మె గురించి నేరుగా మంత్రితో చర్చించిన గవర్నర్ తమిళిసై ఇప్పుడు మరో సమ్మె దిశగా జోక్యం చేసుకున్నారు. చెన్నై నుండి వచ్చిన గవర్నర్ చేరుకున్నారు. ఆ వెంటనే, తెలంగాణ స్టేట్‌ ట్యాక్సీ అండ్‌ క్యాబ్‌ డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌కు నేరుగా ఫోన్‌ చేశారు. చర్చలకు రావాలని ఆహ్వానం పలికారు. వారితో దాదాపు 35 నిమిషాలపాటు చర్చించారు. ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, 40 వేల నుంచి 50 వేల దాకా ఉన్న క్యాబ్‌లు ఆగిపోతే లక్షలాది మందికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రెండు లేదా మూడు రోజులు సమయం ఇస్తే వారి సమస్యలను పరిష్కరిస్తాను అంటూ హామీ ఇచ్చారు. సమ్మె విరమించాలని సూచించారు. సమ్మె కొనసగిస్తే ప్రధానంగా ఐటీ రంగంపై ప్రభావం పడితే.. అది హైదరాబాద్‌ నగరానికి చెడ్డ పేరు వస్తుందనే ఆందోళన వ్యక్తం చేసారు.

సమ్మె విరమించిన క్యాబ్ జేఏసీ..

సమ్మె విరమించిన క్యాబ్ జేఏసీ..

క్యాబ్ జేఏసీ నేతలతో సమావేశమైన గవర్నర్ వారి డిమాండ్లు..సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిలుపునిచ్చింది. ట్యాక్సీ యాప్‌లపై నియంత్రణ విధించడం.. కనీస చార్జీ రూ.120గా నిర్ధారించడం.. ప్రతి కిలోమీటర్‌కు రూ.22 కనీస చార్జీ వసూలు..ఓలా, ఉబర్‌ సంస్థలు 10 శాతానికి మించకుండా కమీషన్‌ తీసుకునేలా నిబంధనలు విధించడం వంటి అంశాలను జేఏసీ నేతలు గవర్నర్ కు వివరించారు. వీటిని ఆసక్తిగా విన్న గవర్నర్ వీటి పైన తాను అధికారులతో చర్చించి..పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. దీంతో.. గవర్నర్ హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ చైర్మన్‌ ప్రకటించారు. తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుండి స్పందన రాలేదని..గవర్నర్ స్వయంగా జోక్యం చేసుకొని తమ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని జేఏసీ నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు సైతం గతంలో గవర్నర్ ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఆ తరువాత గవర్నర్ నేరుగా మంత్రి అజయ్ కు ఫోన్ చేసి సమ్మె పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల పైన వాకబు చేసారు.

గవర్నర్ పైన ప్రశంసలు..

గవర్నర్ పైన ప్రశంసలు..

ఆర్టీసీ సమ్మ పైన కోర్టు సూచనలు చేసినా..ఇప్పటి వరకు పరిష్కారం రాలేదు. ఇదే సమయంలో క్యాబ్ సమ్మె సైతం కొనసాగితే సోమవారం నుండి విద్యా సంస్థలు ప్రారంభం అవుతున్నాయి. ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు పడుతారు. దీంతో..ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోయినా..నేరుగా గవర్నర్ వారిని పిలిచి చర్చలు చేయటం..సమ్మె విరమించేలా ఒప్పించటం పైన ఇప్పుడు కామన్ పబ్లిక్ లో సానుకూల స్పందన కనిపిస్తోంది. దీని ద్వారా ఇప్పుడు ప్రభుత్వం ఒక రకంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది. తామ చూపించని చొరవ గవర్నర్ చూపించటం...సమ్మె విరమించేలా ఒప్పించటం పైన రవాణా మంత్రి..అధికారులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+