Aghori news: పోలీసుల అదుపులో అఘోరీ నాగసాధు.. అక్కడ 144 సెక్షన్!
లేడీ అఘోరీ నాగసాధు ఇటీవల తెలంగాణలో హల్చల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే . అక్టోబర్ 29న ఆమె ఓ పెద్ద ప్రకటన చేసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తన ప్రాణాలను వదులుకుంటానని చెప్పింది. నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ గుడి దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానని ఆమె ప్రకటించింది. ముత్యాలమ్మ ఆలయంపై దాడి చేస్తున్న వారిని ఎందుకు శిక్షించడం లేదని అఘోరీ ప్రశ్నించింది.
ఆత్మార్పణ చేసుకుంటానని సంచలన ప్రకటన చేసిన అఘోరీ
తెలంగాణలో ముత్యాలమ్మ విగ్రహంపై దాడి చేసిన ఘటన నేపధ్యంలో ఒక్కసారిగా తెలంగాణలో ప్రత్యక్షమైన అఘోరీ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆపై నవంబర్ 1వ తేదీన ఆత్మార్పణ చేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దీంతో పోలీసులు అఘోరీ నాగసాధును అరెస్ట్ చేసారు. అఘోరీ ని ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా, సురక్షితంగా ఉంచడానికి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

అఘోరీ హౌస్ అరెస్ట్
అఘోరీ హైదరాబాద్ అనే నగరానికి వెళ్తుండగా.. రాత్రి సిద్దిపేట ప్రాంతంలో మంచిర్యాల పోలీసులు అడ్డుకున్నారు. వారు అఘోరీని తిరిగి తన స్వగ్రామమైనన మంచిర్యాల జిల్లా కుశనపల్లికి తీసుకువెళ్లారు. భారీ ఎస్కార్ట్ మధ్య కుశనపల్లిలోని ఇంట్లో హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇంటి నుండి బయటకు రాకుండా నిర్బంధించారు. అఘోరీ అరెస్ట్ నేపధ్యంలో మంచిర్యాల పరిసర గ్రామాలలో 144సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు.
తెలంగాణలో అఘోరీ రచ్చ , పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
కాగా ఇటీవల కేదార్ నాథ్ వెళ్ళిన అఘోరీ అక్కడ ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని, తిరిగి తెలంగాణాకు వచ్చాక విధ్వసం సృష్టిస్తానని తెలిపారు. తన గురించి తప్పుడు కథనాలు వేసిన యూ ట్యూబ్ చానల్స్ వాళ్ళ అంతు చూస్తానని కూడా పేర్కొన్నారు. పలు యూ ట్యూబ్ చానల్స్ పై పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు.
తెలంగాణా ఆలయాలను సందర్శిస్తున్న అఘోరీ
ఇక ఇదే క్రమంలో ,మళ్ళీ తెలంగాణాకు వచ్చిన లేడీ అఘోరీ తెలంగాణాలోని కొండగట్టు ఆలయంలో స్వామివారికి నిన్న ప్రత్యేక పూజలు చేశారు. ఇక వేములవాడ, కొమురవెల్లి ఆలయాలను కూడా సందర్శించనున్నట్టు పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో రేపు ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మత్యాగం చేస్తానని ఆమె గతంలో చేసిన ప్రకటన నేపధ్యంలో పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. .












Click it and Unblock the Notifications