తెలుగు న్యూస్ ఛానల్లో AI యాంకర్ మాయ; రియల్ యాంకర్లకు ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్ షాక్!!
మీడియాలో యాంకర్లకు కొత్త కష్టాలు వచ్చినట్టుగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ల ఉపాధిని పోగొట్టేలా కనిపిస్తుంది. న్యూస్ చదవడానికి ఇప్పటికే ఒరియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రయోగం జరిగింది. OTV కృత్రిమ మేథ సహాయంతో ఓ న్యూస్ యాంకర్ ను రూపొందించింది.
ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ లిసా ను రూపొందించి, లిసా తో వార్తలను చదివిస్తోంది. ఇక ఇదే బాటలో తెలుగు మీడియాలో బిగ్ టీవీ సంచలనానికి తెరతీసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు టీవీ ఛానల్ లో లేనివిధంగా బిగ్ టివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో న్యూస్ యాంకర్ ను రూపొందించింది.

బిగ్ టీవీ రూపొందించిన వర్చువల్ న్యూస్ యాంకర్ పేరు మాయ. తెలుగులో చక్కగా ఈ న్యూస్ యాంకర్ వార్తలు స్పష్టంగా చదువుతోంది. ఈ వర్చువల్ న్యూస్ యాంకర్ చక్కని కట్టు, బొట్టుతో అందంగా ఉంది. న్యూస్ యాంకర్ లకు పోటీగా వార్తలు చదువుతుంది.ఈ వర్చువల్ యాంకర్ మాయ ను తెలుగులో వార్తలు చదివేలా ప్రోగ్రామ్ చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా న్యూస్ ఛానల్స్ యాంకర్లను రూపొందిస్తున్న క్రమంలో యాంకర్ల జీవనోపాధి దెబ్బతినే ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత నిరుద్యోగులను పెంచే ప్రమాదం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది.టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషపడాలో, మానవ వనరుల వినియోగం తగ్గి పోతున్నందుకు బాధ పడాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ఈ విధంగా వర్చువల్ యాంకర్లను తయారు చేయడం మొదలు పెడితే, ఈ ప్రయోగం సక్సెస్ అయితే టెలివిజన్ రంగంలో యాంకర్ లుగా పని చేస్తున్న చాలామంది పొట్టకూటి కోసం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తూ మీడియా టెక్నాలజీలో దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది. ఇది యాంకర్లకు కష్టకాలాన్ని తీసుకొస్తోంది.












Click it and Unblock the Notifications