మంత్రివర్గ విస్తరణ, కొత్తగా ఛాన్స్ ఎవరికి - తేల్చేసిన ఖర్గే..!!

ఏఐసీసీ చీఫ్ ఖర్గే తెలంగాణ నేతలకు తమ వైఖరి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పైన ఆరా తీసారు. ముఖ్య నేతలకు కీలక సూచనలు చేసారు. రాష్ట్రంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి వాకబు చేసారు. ఇదే సమయంలో మంత్రివర్గంలో స్థానం కోసం పోటీ పడిన పలువురు నేతలు ఖర్గేను కలిసారు. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను వివరించారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అందరి అభిప్రాయాలు విన్న ఖర్గే పదవుల విషయంలో పార్టీ వైఖరి ఏంటో తేల్చి చెప్పారు.

కీలక మంత్రాంగం
ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ కు చేరుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు ఖర్గేను కలిసారు. మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు ఖర్గే ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. తమకు ఉన్న అర్హతలను వివరించడంతోపాటు పార్టీకి చేసిన సేవలను గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగా రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, బాలూ నాయక్‌.. ఖర్గేతో ముఖాముఖి భేటీ అయ్యారు. అందరి అభిప్రాయాల ను ఖర్గే సావధానంగా విన్నారు. పార్టీ కోసం తాను ఎంతో శ్రమ చేయాల్సి వచ్చిందని.. పార్టీ కోసం దగ్గరి బంధువులతోనూ శత్రుత్వం పెంచుకోవాల్సి వచ్చిందని ఖర్గే దృష్టికి తెచ్చారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు.. ఇంద్రవెల్లి సభ సందర్భంగా తనకు హామీ కూడా ఇచ్చారని చెప్పినట్లు సమాచారం.

aicc-chief-kharge-directions-on-party-strengthen-to-the-tpcc-leaders

చోటు కల్పించండి
తనకు కాకుండా ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారంటూ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఉంటే.. రెండు జిల్లాలకు కలిపి ఒక్క మంత్రి పదవి కూడా లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని ఖర్గే దృష్టికి తెచ్చారు. అర్బన్‌ ప్రాంతాల్లో బీజేపీ బలం పుంజుకుంటోందని వివరించారు. పార్టీలో సీనియర్‌గా తనకు అవకాశం కల్పించాలని సుదర్శన్‌రెడ్డి కోరారు. మంత్రివర్గంలో బంజారాలకు అన్యాయం జరిగిం దంటూ ఖర్గేకు బాలూ నాయక్‌ ఫిర్యాదు చేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి.. తాను మంత్రి పదవికి ఏ విధంగా అర్హుడినో వివరిస్తూ ఖర్గేకు నివేదికను అందించారు.

ఖర్గే ఆరా
అందరి అభిప్రాయలు విన్న తరువాత ఖర్గే ప్రస్తుత కేబినెట్ లో సామాజిక కూర్పు గురించి ముఖ్య నేతలతో ఆరా తీసారు. ఏ నేతకు ప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వని ఖర్గే.. బీఆర్ఎస్, బీజేపీ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాల గురించి తెలుసుకున్నట్లు సమాచారం. ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గ నేతలు మంత్రి పదవి కోసం ఖర్గేను కలిసారు. కేబినెట్ లో ఆ వర్గానికి ఇప్పుడున్న పదవుల సంఖ్య గురించి ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, ఆ వర్గానికి అవకాశం ఇవ్వటం సాధ్యపడదనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు పార్టీ నేతల సమాచారం. మంత్రివర్గంలో మరో మూడు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. కాగా, మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి సైతం ప్రత్యేకంగా ఖర్గేను కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+