కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
తెలంగాణలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ సీటు పై సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రులు భట్టి,పొంగులేటి తమ సొంత వారికి సీటు కోసం పట్టుబడుతున్నారు. ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. నామినేషన్లకు గడువు ముగుస్తోంది. దీంతో, ఖమ్మం సీటు పైన కాంగ్రెస్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. స్థానికంగా సీటు కోసం పోటీ ఉండటంతో..నేరుగా ప్రియాంక గాంధీని ఖమ్మం నుంచి బరిలోకి దింపే అంశం పైన చర్చ చేస్తోంది. ఈ సాయంత్రం తుది నిర్ణయం తీసుకోనుంది.
ఖమ్మం సీటు దక్కేదెవరికి
ఖమ్మం సీటు పంచాయితీ. అనూహ్యమైన మలుపు తీసుకుంటోంది. ఈ సీటు నుంచి పార్టీ టికెట్ కోసం రఘురామిరెడ్డి, రాయల నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు పోటీ పడుతున్నారు. కాగా, ఖమ్మంతో పాటు కరీంనగర్, హైదరాబాద్ సీట్లనూ కాంగ్రెస్ పెండింగ్‌లోనే ఉంచింది. అయితే కరీంనగర్‌లో వెలిచాల రాజేశ్వర్‌రావు తరహాలోనే ఖమ్మంలో మంగళవారం రఘురామిరెడ్డి కూడా అధిష్ఠానం పేరు ప్రకటించనప్పటికీ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు, మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేరళకు వెళ్లారు. ఖమ్మం సీటు విషయమై ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకే వెళ్లారన్న ప్రచారమూ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

ఖమ్మం నుంచి ప్రియాంక..!
అటు మరో మంత్రి పొంగులేటి తన సోదరుడికి సీటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అనూహ్యంగా గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక పేరు తాజాగా ముందుకు రావటం విశేషం. ప్రియాంక పేరును కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేయటం అనేది.. రాహుల్ పోటీ చేసే స్థానాలపై ఆధారపడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వయనాడ్ నుంచి సిటింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ ఇప్పటికే ఆ స్థానంలో నామినేషన్ వేశారు. వయనాడ్‌తోపాటు యూపీలోని అమేథీ నుంచి కూడా రాహుల్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఉత్తరాది, దక్షిణాది రెండింటి నుంచీ రాహుల్ పోటీ చేసినట్లవుతుంది.
హైకమాండ్ నిర్ణయం పై ఉత్కంఠ
ప్రియాంకను కూడా ఇదే తరహాలో ఉత్తరాది, దక్షిణాదిల్లోని రెండు స్థానాల నుంచి బరిలో దించాలని.. యూపీలోని రాయ్‌బరేలీ, ఖమ్మంల నుంచి ఆమెను పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ రాహుల్ వయనాడ్‌కు మాత్రమే పరిమితమైతే.. ప్రియాంక యూపీలోని అమేధీ, రాయ్‌బరేలీల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ పడతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తద్వారా ఉత్తరాది నుంచి ప్రియాంక ప్రాతినిధ్యం వహిస్తే.. దక్షిణాది నుంచి రాహుల్ ప్రాతినిధ్యం ఉంటుందని పేర్కొన్నాయి. ఈ సాయంత్రం ఢిల్లీలో తెలంగాణలో పెండింగ్ సీట్లలో అభ్యర్దుల ఖరారు పైన కీలక భేటీ జరగనంది. ఈ సమావేశంలో ఖమ్మం అభ్యర్ది పైన పార్టీ అధికారికంగా ప్రకటన చేయనుందని సమాచారం.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications