షామీర్‌పేట్ కాల్పులు: ఆ వ్యక్తిని తాను కాదంటూ ‘కార్తీక దీపం’ ఫేం మనోజ్ క్లారిటీ
హైదరాబాద్: నగర శివారులోని శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్‌లో శనివారం జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ దాస్‌పై మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన సిద్ధార్థ అక్కడ్నుంచి తప్పించుకుని శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, కాల్పులు జరిపిన మనోజ్.. పలు టీవీ సీరియళ్లలో నటించాడంటూ ప్రచారం జరిగింది.
Recommended Video

ఈ క్రమంలో టీవీ సీరియల్స్‌లో నటించిన మనోజ్ వివరణ ఇచ్చారు. తన ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియోను పోస్టు చేశారు. కాల్పులు జరిపింది తాను కాదని.. తాను బెంగళూరులో ఉన్నానని తెలిపారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా పలు మీడియా ఛానళ్లు తన ఫొటోను ఉపయోగిస్తున్నాయని మండిపడ్డారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు.

'అందరికి నమస్కారం.. 'కార్తీక దీపం'లో ప్రేమ్‌గా నటించా. ఇప్పుడు 'మౌన పోరాటం'లో నటిస్తున్నా. ఉదయం నుంచి ఒక ఫేక్‌న్యూస్ వైరల్ అవుతోంది. మనోజ్ అనే వ్యక్తి సిద్ధార్థ్ అనే మరొకరిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మనోజ్ ఫొటోలకు బదులు నా ఫొటోలు, వీడియోలను సీరియల్ క్లిప్స్ ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం నా స్నేహితులు ఫోన్ చేసి చెప్పారు. మొదట ఇది ఫ్రాంక్ కాల్ అనుకున్నా. ఆ తర్వాత కొన్ని టీవీల్లో నా ఫొటోలను చూపించారు. ఈ రోజు ఉదయం నేను బెంగళూరులో ఉన్నా. నాకు ఈ కేసుకూ ఏ సంబంధం లేదు. ఆ మనోజ్ నాయుడు నేను కాదు. నాపై వచ్చిన ఈ వార్తలను ఎవరూ నమ్మకండి. ఇది ఫేక్ న్యూస్' అని మనోజ్ ఆ వీడియోలో స్పష్టంచేశారు.
షామీర్‌పేట్ కాల్పుల ఘటనకు సంబంధించి డీసీపీ సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన సిద్ధార్థ్ దాస్.. ఆయన భార్య స్మిత, కుటుంబ కలహాల కారణంగా 2019లో విడిపోయారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్మిత్ శామీర్‌పేటలోని విల్లా నెంబర్ 21లో మనోజ్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో శనివారం సిద్ధార్థ తన పిల్లలను చూసేందుకు విల్లా వద్దకు వచ్చాడు.
ఈ నేపథ్యంలో స్మితతో గొడవపడ్డాడు. దీంతో అక్కడేవున్న మనోజ్ కుమార్ ఆగ్రహానికి గురై తన వద్ద ఉన్న ఎయిర్ గన్‌తో సిద్ధార్థపై కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన సిద్ధార్థ అక్కడ్నుంచి తప్పించుకుని శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాల్పులు జరిపిన మనోజ్.. పలు టీవీ సీరియళ్లలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, మనోజ్ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సిద్ధార్థ పిల్లలు ఫిర్యాదు చేశారు. తనను కొట్టినట్లే.. తన చెల్లిని కూడా ఇష్టం వచ్చినట్లు మనోజ్ కొట్టాడని సిద్ధార్థ కుమారుడు చెప్పాడు. తాము తమ తల్లి వద్ద ఉండలేమని.. తమ తల్లి తరపు బంధువుల వద్ద కూడా ఉండలేమన్నారు.
చైల్డ్ వెల్ఫేర్ అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని సిద్ధార్థ కుమారుడు సీడబ్ల్యూసీకి కోరాడు. తాము తమ తండ్రి వద్ద ఉంటామని చెప్పారు. కాగా, సిద్ధార్థతో విడిపోయిన తర్వాత నుంచి మనోజ్‌తో స్మిత సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. వీరితోనే సిద్ధార్థ పిల్లలు ఉంటున్నారు. మనోజ్ వారిని చిత్రహింసలకు గురిచేయడంతో పిల్లలు తమ తండ్రికి విషయం చెప్పిన క్రమంలో ఆయన వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications