ఏపీ, తెలంగాణకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గుడ్‌న్యూస్
Air India express: తెలుగు రాష్ట్రాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం నుంచి త విమాన సర్వీసులను గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నగరాల నుంచి వారానికి 13 విమాన సర్వీసులు నడుస్తుండగా. వాటిని 250కి అంటే 45 శాతం అధికంగా పెంచుతున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.
విశాఖపట్నం, విజయవాడ, గ్వాలియర్ నుంచి హైదరాబాద్ నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ నుంచి బెంగళూరు, కొచ్చికి సర్వీసులు పెరగనున్నట్లు తెలిపింది. సర్వీసుల పెంపు ఈ ప్రాంతాల వారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్డ్ తెలిపారు. ప్రతివారం 200 సర్వీసులతో తమ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ మూడో అతిపెద్ద కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్ నుంచి నేరుగా 17దేశీయ విమానాశ్రయాలకు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన ఎయిర్ పోర్టులకు సర్వీసులు నిర్వహిస్తున్నట్లు గార్డ్ తెలిపారు.కలంకరి -ప్రేరేపిత లివరీని కలిగి ఉన్న మా కొత్త విమానం.. తెలుగు మాట్లాడే ప్రాంత గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి మా అంకితభావాన్ని నొక్కి చెబుతుందని ఆయన అన్నారు.
ఇక, విజయవాడ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి ప్రతి వారం 28 విమాన సర్వీసులను దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎయిర్ ఇండియా నడుపుతోంది. మరోవైపు, దేశ వ్యాప్తంగా ఈ శీతాకా సీజన్‌లో ఎయిర్ ఇండియా 400 రోజువారీ విమాన సర్వీసులు నిర్వించనున్నట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే సీజన్లో 325 రోజువారీ సర్వీసులు నిర్వహించడం గమనార్హం.












Click it and Unblock the Notifications