మందుబాబులకు అలర్ట్.. ఆ మూడు రోజులు క్లోజ్

తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీ శివార్లలో మూడు రోజులపాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మద్యం షాపులు మూసి వేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 25 ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 27 ఉదయం 6 గంటల వరకు షాపులు క్లోజ్ లో ఉంటాయని ప్రకటించారు. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఫిబ్రవరి 27న వ‌రంగ‌ల్-ఖ‌మ్మం-నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ, మెద‌క్-నిజామాబాద్- ఆదిలాబాద్- క‌రీంన‌గ‌ర్ టీచర్ ఎమ్మెల్సీ, మెద‌క్-నిజామాబాద్-ఆదిలాబాద్-క‌రీంన‌గ‌ర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక‌లు జరగనున్నాయి. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఓటర్లను మభ్యపెట్టకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Alert for liquor addicts three days shops closed

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష చేశారు. పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు, మైక్రో అబ్జర్వర్‌ల నియామకం, పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్‌ బాక్సుల గురించి కలెక్టర్లు సీఈవోకు వివరించారు.

మద్యం దుకాణాలు ఎక్కడెక్కడ క్లోజ్ అంటే..

ముఖ్యంగా హైదరాబాద్ సిటీ శివారు లోని కొల్లూరు, ఆర్సీపురం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కల్లు దుకాణాలు, వైన్‌ షాపులు, రెస్టారెంట్లు.. బార్‌లు, క్లబ్బులు మూసి వేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+