రాములోరి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. భ‌ద్రాచ‌లం ప్ర‌సాదంపై కీల‌క నిర్ణ‌యం...

తెలంగాణ‌లో ప్ర‌సిద్ధిచెందిన ఆల‌యాల‌లో భ‌ద్రాచ‌లం ఒక‌టి. ఇక్క‌డ కొలువైన ఉన్న శ్రీ సీతారామంచంద్ర‌స్వామిని ద‌ర్శించుకునేందుకు నిత్యం భ‌క్తులు వ‌స్తుంటారు. అయితే, రాములోరి ప్ర‌సాదంపై ఆల‌య ఈవో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.
ఇక‌నుంచి ఆన్‌లైన్‌లో కూడా అన్న ప్రసాదం టికెట్లు అందుబాటులోకి రానున్న‌ట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మాన్యువల్‌గా గంట సేపు మాత్రమే అన్నదానం టికెట్లు ఇచ్చేవారు. దానివ‌ల్ల రాముల‌వారి ప్ర‌సాదం కొందరికి మాత్రమే ల‌భించేంది. దీంతో ఆల‌య అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానంలో భక్తులందరికీ అన్న ప్రసాదం ల‌భించేలా ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా ఇప్పటికే పూర్తి చేసిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు.

రాములోరి ఆల‌యంలో చాలా కాలంగా అన్నప్రసాదం టికెట్లు ఇస్తున్నారు. ఆ టికెట్లను తీసుకెళ్లి అన్నదాన సత్రంలో అందిస్తే.. అక్కడి సిబ్బంది భక్తులకు అన్న ప్రసాదం వడ్డించేవారు. ఈ ప్ర‌సాదం ప్రతి రోజూ సుమారు 1000 మందికి పైగా భక్తులు తినేవారు.
వారాంతాల్లో పండుగ‌లు, ఉత్స‌వాల్లో మాత్రం ఇక్క‌డ ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే అన్న ప్రసాదం టికెట్లను గంటసేపు మాత్రమే ఇస్తుండటంతో మిగిలివారికి అన్న ప్రసాదం అందటం లేదు. ఇక నుంచి ఈ సమస్య ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో ఆన్‌లైన్ టిక్కెట్ల ద్వారా భ‌క్తుల‌కు అన్న‌ప్రసాదం అందించేందుకు సిద్ధమయ్యారు.

Alert to ram devotess Crucial decision on Bhadrachalam Prasad

విశేషంగా విరాళాలు..

ఆలయంలోని పడమర మెట్ల‌ సమీపంలోనే ఆన్‌లైన్‌ టికెటింగ్ వ్యవస్థను కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. అన్నప్రసాదం కావాల‌నుకునే భక్తులు అక్కడ ఏర్పాటు చేసే కంప్యూటర్‌ కెమెరా ముందు నిలబడితే అది ఫొటో తీస్తుంది. అలా ఫొటో దిగినవారికి ఓ నంబర్‌తో ఉన్న రసీదు వస్తుంది. దీన్ని తీసుకుని సత్రానికి వెళ్తే అక్కడి సిబ్బంది అన్న ప్ర‌సాదం వడ్డిస్తారు. రు.
ఈ అన్నప్రసాదంలో అన్నం, ఒక కూర, పప్పు, సాంబారు, పచ్చడి, మజ్జిగ, స్వీటు వంటివి ఇస్తున్నారు. ఈ అన్నదానానికి చాలామంది భక్తులు విశేషంగా విరాళాలు కూడా అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+