ఈ సారి నిమజ్జనోత్సవం ప్రత్యేకం...!!

గణేష్ నిమజ్జనం కోసం భాగ్యనగరం సిద్దమైంది. పండుగ వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గణేష్ నిమజ్జన శోభా యాత్ర రూట్ మ్యాప్ ను విడుదల చేసారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సారి గణేష్ నిమజ్జనం ప్రత్యేకత సంతరించుకుంది.

ఏర్పాట్లు పూర్తి
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మొదటిసారి మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలిపారు. శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు పూజ కార్యక్రమాలు చేశారన్నారు. రేపు నిమజ్జన ఘట్టమని.. భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. 360 క్రేన్లు హైదరాబాద్ మొత్తం ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్ క్రేన్లు కూడా ఉన్నాయన్నారు. అవసరమైన ప్రాంతాలకు తరలించదానికి ప్రత్యేక అధికారులు ఉన్నారని చెప్పారు.

All set for Ganesh idol immersion in Hyderabad with additional Security measures

ప్రభుత్వం సమాయత్తం
ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రేపు (మంగళవారం) ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. ఇప్పటికే పనులు జరుగుతున్నాయన్నారు. సమయానికి నిమజ్జనం పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. ఇక, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. రేపు (మంగళవారం) మధ్యాహ్నం మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా ఈరోజు ఉదయం ఖైరతాబాద్ గణనాథుడి వద్ద కర్ర తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి.

సాగర తీరానికి
ఇప్పటికే మహా గణపతి వద్దకు శోభాయాత్ర ట్రక్కు చేరుకుంది. ఈరోజు బడా గణేష్ దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నాలుగు వైపులా బారికేడ్లును పోలీసులు ఏర్పాటు చేశారు. దర్శనం నిలిపివేత విషయం తెలియక బడా గణేష్ వద్దకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అనుమతి లేకపోవడంతో భక్తులు నిరాశగా వెను తిరుగుతున్నారు. మరోవైపు ట్యాంగ్‌బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్, బేబీ వాటర్ పాండ్ వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ మెుత్తంగా 31 క్రేన్లు ఏర్పాటు అయ్యాయి. క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరుగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+