జూబ్లీహిల్స్ లో లాస్ట్ మినిట్ రాజకీయం, ఊహించని మలుపు..!!

జూబ్లీహిల్స్ పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ఉప ఎన్నికలో గెలుపు మూడు ప్రధాన పార్టీల కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. పోలింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం మరో గంట పొడిగించింది. పోలింగ్ ముగిసే వరకూ ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాజా సమీకరణాల మేరకు హోరా హోరీ సమరం ఖాయంగా కనిపిస్తోంది. చివరి నిమిషంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్య ఫలితం దిశగా పోలింగ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.

జూబ్లీహిల్స్ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అటు ప్రచారం ముగిసిన తరువాత ప్రధాన పార్టీల నేతలు చివరి ప్రయత్నాలు ప్రారంభించారు. పోలింగ్ ముగిసే వరకూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే వ్యూహాలను స్థానిక కేడర్ తో అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులతో సమీక్ష చేసారు. పోలింగ్ పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని తేల్చి చెప్పారు.

All set for Jubilee hills polling key leaders focus on Poll management

మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష చేసారు. భారీ స్థాయిలో ఓటింగ్ జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ నేతలు సైతం డివిజన్ల వారీగా తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇక.. ఇప్పటికే పలు సర్వే నివేదికలు తమ అంచనాలను వెల్లడించాయి. మూడు పార్టీల మధ్య పోరు ఉన్నా.. రెండు ప్రధాన పార్టీల మధ్య హోరా హోరీ తప్పేలా లేదు.

ఎవరికి వారు తమ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. సామాజిక సమీకరణాలు ఇక్కడ కీలకంగా మారాయి. కాంగ్రెస్ తొలి నుంచి అభ్యర్ధి ఎంపిక నుంచి ఓటింగ్ వరకు వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేసింది. మంత్రులను బరిలోకి దించింది. మిత్రపక్షాల సహకారం పరోక్షంగా అందుతోంది. బీఆర్ఎస్ గెలుపు పైన సర్వే నివేదికలతో మరింత పెంచుకుంది. బీజేపీ నేతలు లోక్ సభ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని చెబుతున్నారు.

All set for Jubilee hills polling key leaders focus on Poll management

అయితే.. బస్తీ ప్రాంతాలు ఎక్కువ గా ఉండటం తో నాయకులు ప్రస్తుతం ప్రతి పోలింగ్‌ కేంద్రం, డివిజన్‌ వారీగా లెక్కలు వేస్తున్నారు. ఓ సామాజిక వర్గం ఓట్లపై దృష్టి సారించిన పార్టీలు అక్కడ సరికొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. డివిజన్ల వారీగా రేపు పోలింగ్ ముగిసే వరకూ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహ రించేలా ప్రణాళికలు సిద్దం చేసాయి. అయితే, ఈ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ పోరు లో ఎవరు గెలిచినా మెజార్టీ స్వల్పమేననేది గ్రౌండ్ రిపోర్ట్. మరి ఓటర్ల తీర్పు ఏంటో వేచి చూడాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+