మందు బాబులకు షాక్, ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..!!
పోలీసు అధికారులు కీలక ఆదేశాలు ఇచ్చారు. హోరా హోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు వేళ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చర్యలు చేపట్టారు. కౌంటింగ్ జరిగే ప్రాంతంలో ఆంక్షలు విధించారు. లెక్కింపు సందర్భంగా నియోజకవర్గంలో అన్ని మద్యం దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు వంటి మద్యం విక్రయించే ప్రదేశాలు మూసివేయాలని ఆదేశించారు. దీంతో, పాటుగా ర్యాలీలు.. సభలు.. ఉత్సవాల పైన నిషేధం విధించారు.
ప్రతిష్ఠాత్మకంగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు రేపు (శుక్రవారం) ప్రారంభం కానుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ కోసం ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. మొదట షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమై, చివరగా ఎర్రగడ్డ డివిజన్‌తో ముగుస్తుంది. కాగా, లెక్కింపు సందర్భంగా నియోజకవర్గంలో అన్ని మద్యం దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు వంటి మద్యం విక్రయించే ప్రదేశాలు నవంబర్ 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15 ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

ఇదే సమయంలో పోలీసులు ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రానున్న 24 గంటల సమయంలో ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, పటాకుల ప్రదర్శనలు నిషేధించారు. ఉప ఎన్నికలో లక్షా 94 వేల 632 ఓట్లు పోలయ్యాయి. వీటిని పది రౌండ్లుగా 42 టేబుళ్లపై లెక్కింపు జరుపనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత 103 హోం ఓటింగ్‌లను లెక్కించిన తర్వాత ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. సాధారణం గా 14 టేబుళ్లపై కౌంటింగ్ జరుగుతుంది. ఉప ఎన్నిక కావడం, ఉద్యోగులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ టేబుళ్లు ఏర్పాటు చేసి త్వరగా లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉదయం 8.45 గంటలకల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపే తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications