బీజేపీతో పొత్తు: తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాలివే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో బీజేపీ రాష్ట్ర నేతలు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేనకు కేటాయించే స్థానాలపై స్పష్టత వచ్చింది.

ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, వైరా, నాగర్‌కర్నూల్, కోదాడ, కూకట్‌పల్లి స్థానాలు కేటాయించినట్లు సమాచారం. అయితే, శేరిలింగంపల్లి స్థానంపై మాత్రం ఎటూతేల్చలేకపోయినట్లు తెలిసింది. ఈ స్థానం కోసం జనసేన పట్టుపడుతుండగా.. ఇప్పటికే బీజేపీ నేతలు చాలా మంది ఇక్కడ్నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండటం గమనార్హం.

Alliance with BJP: Janasena party to contest in these assembly seats in telangana

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన అనంతరం శేరిలింగంపల్లి స్థానంపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కాగా, మొదట జనసేన 11 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినా.. తాజా చర్చల్లో 8 స్థానాలకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా బీజేపీ, జనసేన నేతలు నిర్ణయిచారు.

119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 చోట్ల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మిగిలిన 31 స్థానాలకు గానూ ఎనిమిది చోట్ల జనసేన బరిలోకి దిగుతోంది. ఇక మరో 22 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాని మోడీ నవంబర్ 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పాల్గొనే బీసీస ఆత్మగౌరవ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ప్రధాని సభలో పాల్గొనాలని పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ కోరడంతో ఆయన అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+