చిరంజీవితో అల్లు అర్జున్ పిల్లలు.. ఆ వేడుకలో సందడి!!

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నేడు దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఈ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించడానికి మన పూర్వీకులు చేసిన పోరాటాలను త్యాగాలను మనమందరం స్మరించుకుందామంటూ పేర్కొన్నారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వారి ఆదర్శాలు ఎల్లప్పుడూ ధర్మం, కరుణ మరియు శ్రేష్టమైన మార్గంలో మనల్ని నడిపిస్తాయని, జై హింద్ అంటూ ఆయన తన దేశభక్తిని చాటుకున్నారు. ఇక ఇదే సమయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మెగాస్టార్ చిరంజీవి జాతీయ పతాకావిష్కరణ చేసి వేడుకలు నిర్వహిస్తారు.

allu arjun kids participated in independene day celebartions in blood bank along with chiranjeevi allu arvind

చిరంజీవితో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అల్లు అరవింద్
ఇదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో నిర్మాత అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం కూడా అల్లు అరవింద్ ఈ వేడుకలలో పాల్గొంటారు. ఇదే క్రమంలో ఈ సంవత్సరం కూడా వేడుకలకు వచ్చిన అల్లు అరవింద్ ఈసారి అల్లు అర్జున్ పిల్లలను కూడా ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు.

అల్లు అర్జున్ పిల్లలతో చిరంజీవి
దీంతో చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద మెగాస్టార్ చిరంజీవి పక్కనే అల్లు అర్జున్ పిల్లలు కనిపించి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మనవరాళ్లు, అల్లు అర్జున్ కొడుకు అయాన్, కూతురు అర్హ కూడా పాల్గొన్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒకపక్క అల్లు అర్జున్ చిరంజీవి ఫ్యామిలీ కి సంబంధించి తాజాగా వార్ నడుస్తుంది. గత ఏపీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య చోటు చేసుకున్న చిచ్చు, ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యాఖ్యలతో రచ్చగా మారింది.

మెగా, అల్లు ఫ్యామిలీల రగడపై చర్చ
ఇక అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయాలలోనూ స్పందించకుండా ఉంటే అల్లు అర్జున్ పిల్లలు చిరంజీవితో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజంగానే అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా? లేకుంటే వారేది మాట్లాడిన కావాలని ఒకరు మాట్లాడిన వ్యాఖ్యలను ఇంకొకరికి ఆపాదిస్తూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారా అన్న చర్చ ప్రజలలో జరుగుతుంది. మొత్తంగా చూస్తే మెగా ఫ్యామిలీ పై అల్లు అర్జున్ కినుక వహించిన వేళ చిరంజీవితో బన్నీ పిల్లలు కనిపించడం మాత్రం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+