Investments: రూ.40 వేల కోట్ల పెట్టుబడులు.. 35 వేల ఉద్యోగాలు..!
పెట్టుబడులను ఆకర్షించటంలో రేవంత్ రెడ్డి సర్కార్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. ఈసారి దాదాపు రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించారు.
దావోస్ లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ వేదికగా 2020లో రూ.500 కోట్లు, 2022 లో రూ.4,200 కోట్లు, 2023లో రూ.21వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ రెండు నెలల వ్యవధిలోనే అంతకు రెట్టించిన పెట్టుబడులు (దాదాపు రూ.40 వేల కోట్లు) రాష్ట్రానికి తీసుకొచ్చింది. ఈ రూ.40 కోట్ల పెట్టుబడితో 35 వేలకు పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

తెలంగాణలో టాటా గ్రూప్, అదానీ, జిందాల్, గోడి ఇండియా, వెబ్ వెర్క్స్, ఆరాజెన్ లైఫ్ సైన్సెస్, గోద్రెజ్ ఇండియా, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, ఊబర్, క్యూ సెంట్రియో, ఓ9 సొల్యూషన్స్ లాంటి దిగ్గజ కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మాట్లాడడంపై ట్రోల్ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు.
తెలంగాణకు రూ.40 కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనతే రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ వారిలాగా తాము ప్రచారం చేసుకోలేని పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications