అంబటి రాంబాబు కారుపై కర్రలతో దాడి చేసిన టీడీపీ

ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకున్న వేళ.. భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించడానికి కొన్ని గంటల ముందు- ఖమ్మంలో అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనితో జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్తోన్నాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. కేసీఆర్ సుడిగాలి పర్యటలను చేస్తోన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో పాలేరు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Ambati Rambabu car was attacked by the Telangana TDP workers in Khammam

ఈ పరిస్థితుల్లో ఖమ్మం వెళ్లిన ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై కాన్వాయ్‌పై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడటం కలకలం రేపింది. అంబటి రాంబాబు ప్రయాణిస్తోన్న కారును వారు అడ్డుకున్నారు. కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా నినదించారు.

తన కారుకు అడ్డుపడిన తెలంగాణ టీడీపీ నాయకులతో అంబటి రాంబాబు వాగ్వివాదానికి దిగారు. పోలీసులు, ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బంది వారించడంతో ఆయన కారెక్కారు. కాన్వాయ్ బయలుదేరినప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు దాన్ని వెంబడించడం కనిపించింది. కారుపై కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనతో ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+