అమీర్ పేట్ ఓయో కేసులో బిగ్ ట్విస్ట్.. మహిళను చంపింది ఎవరో తెలిస్తే షాక్..!
ఇటీవల అమీర్ పేట్ లోని గోకుల్ ప్రైడ్ హోటల్ గదిలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో మహిళ దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. మృతురాలు శిరీష(34) ను తన సొంత భర్తే హతమార్చినట్లు తెలిసింది. నిందితుడు ఏ శ్రీనివాస్(38) తో శిరీష్ కు గతంలోనే గుడిలో ప్రేమపెళ్లి జరిగినట్లు వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాకు చెందిన శిరీషకు 2013లోనే వివాహం అయింది. అయితే భర్తతో మనస్పర్థల కారణంగా 2016 లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పేరెంట్స్ వద్దే ఉంటూ SBI కస్టమర్ సర్వీస్ పాయింట్ ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే శిరీషకు పెద్దేముల్ ఓగ్లాపూర్ కు చెందిన శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే వారి పెళ్లిని పెద్దలు నిరాకరించడంతో శిరీష, శ్రీనివాస్ కలిసి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇక తమ పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవడం వల్ల హైదరాబాద్ కు వచ్చి లాడ్జిలో సమయం గడిపి వెళ్లేవారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 24న దుర్గ, గణేష్ అనే మారుపేర్లతో ఎస్ ఆర్ నగర్ పరిధిలోని గోకుల్ ప్రైడ్ OYO లో వీళ్లిద్దరూ రూమ్ తీసుకున్నారు.

అయితే ఈ నెల 25 న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో టీవీ సౌండ్ పెంచి, కర్టెన్ రాడ్ తో శిరీష తలపై బలంగా కొట్టి హతమార్చాడు శ్రీనివాస్. ఇక ఏమీ తెలియనట్లుగా మరుసటి రోజు హోటల్ నుంచి తాను వెళ్లిపోతూ టిఫిన్ చేశాక శిరీష చెక్ ఔట్ చేస్తుందని హోటల్ సిబ్బందికి చెప్పాడు. అయితే శిరీష ఎంతకూ బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది వేరే తాళం చెవితో గది తెరిచారు. ఇక రక్తపుమడుగులో పడి ఉన్న శిరీష మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అంతేకాక పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
