యాదాద్రి బ్రహ్మోత్సవాలు .... స్వస్తి వాచనంతో , మంగళ వాయిద్యాలతో ఘనంగా ప్రారంభం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదాద్రి క్షేత్రం. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.. మార్చి 08వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మొత్తం 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.

తొలిరోజు లక్ష్మీ నరసింహుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు స్వస్తివాచనం తో చుట్టారు వేదపండితులు. విశ్వక్సేనుడు కి తొలి పూజలు జరిపి పంచామృత కలశాలను వేదమంత్రాల నడుమ దర్భలతో పూజించి, పుణ్య జనంతో సంప్రోక్షణ చేశారు. లక్ష్మీనరసింహుడి నిజా భిషేకం నిర్వహించిన మంత్రించిన పవిత్ర జలాన్ని యాదగిరి గుట్ట పైన చిలకరిస్తూ సంప్రోక్షణ నిర్వహించారు. ప్రధాన గర్భాలయము నందు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి కంకణధారణ నిర్వహించారు.మంగళవాయిద్యాల నడుమ దీక్ష కంకణాలను ప్రధానాలయం నుండి బాలాలయం వరకు తీసుకుని వచ్చారు.

 Amid rituals and chanting of veda mantras started yadadri brahmotsavam

బ్రహ్మోత్సవ ప్రారంభ పూజా కార్యక్రమాలకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ హాజరయ్యారు . స్వామి వారి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఉత్సవ నిర్వాహకులు అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి గీతారెడ్డికి కంకణ ధారణ చేశారు. ఆలయంలోని వేదపండితులు, చతుర్వేదాలను , ఉపనిషత్తులను, రామాయణ భాగవతాలను, పంచ సూక్తాలు అను, క్షేత్రమహత్యం పారాయణము, మూల మంత్ర జపాలు నిర్వహిస్తూ బ్రహ్మోత్సవాల తొలిరోజు స్వస్తివాచనం తో ప్రారంభించి ఆ దేవదేవుడికి ప్రత్యేక పూజలు జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+