వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ కీలక నేతలకు అమిత్ షా పిలుపు - పదవుల్లో మార్పులు : కొత్త వ్యూహాల అమలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలంగాణ బీజేపీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో కొద్ది రోజులుగా బీజేపీ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర వరి అంశంతో అటు బీజేపీని.. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలు అమలు చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు సైతం బహిష్కరించారు. కేంద్రం పైన పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానుండటం ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు కేంద్ర బీజేపీ ఆఫీసు నుంచి పిలుపు వచ్చింది.

అమిత్ షా సమావేశంలో ఏం చెబుతారు

అమిత్ షా సమావేశంలో ఏం చెబుతారు


తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గురువారం భేటీ కానున్నారు. గురువారం అందుబాటులో ఉండాలని బండి సంజయ్‌కు అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్టుగా సమాచారం. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సహా నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు అమిత్ షాతో భేటీ కానున్నారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర, రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా వరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన అమిత్ షా చర్చించే అవకాశం ఉంది. ఇదే సమయంలో పార్టీ పరంగా కొన్ని మార్పులకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. హుజూరాబాద్ నుంచి అనూహ్య విజయం సాధించిన ఈటల రాజేందర్ కు పార్టీలో ప్రాధాన్యత పెంచేలా అమిత్ షా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

ఈటలకు పార్టీలో కీలక బాధ్యతలు

ఈటలకు పార్టీలో కీలక బాధ్యతలు

పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేకపోవటంతో..ఈటలకు బీజేపీఎల్పీ నేతగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి కొందరు నేతలు టచ్ లో ఉన్నారని...వారిని ఒప్పించే రాజేందర్ తీసుకున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. ఎక్కువ మందిని చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలన్నది కమలనాథుల ప్లాన్. అందుకే తెలంగాణ‌ కాషాయ ద‌ళం జాయినింగ్స్‌పై ఫోక‌స్ పెట్టింది. ఇతర పార్టీల నుండి వచ్చే వారి కోసం గేట్లు తెరిచి ఉన్నట్లు ప్రకటించిన బీజేపీ.. వ‌ర‌ుస జాయినింగ్‌లకు ఏర్పాటు చేస్తోంది. మ‌రోవైపు ఎన్నిక‌ల వ‌ర‌కు జాయినింగ్స్ ఉంటూనే ఉంటాయి, అందుకే చేరికలు స‌రికొత్త రూపంలో ఉండాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

బియ్యం సేకరణ పైన ఎలా ముందుకెళ్లాలి

బియ్యం సేకరణ పైన ఎలా ముందుకెళ్లాలి


అమిత్ షా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అదే విధంగా హుజూరాబాద్ ఎన్నికల్లో రాజేందర్ ను గెలిపించాలంటూ అదిలాబాద్ సభలోనూ పిలుపునిచ్చారు. ఇక, ఇప్పుడు టీఆర్ఎస్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని వరి విషయంలో వేస్తున్న అడుగులు బీజేపీని రాజకీయం గా ఇబ్బంది పెట్టునున్నాయి. దీంతో.. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కోసం అమిత్ షా తో ప్రధానంగా ప్రస్తావించాలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక, అమిత్ షా ఈ సమావేశం ద్వారా పార్టీ నేతలకు ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Telangana BJP leader meet Amith Shah on thurs day to discuss on state poltiics and Rice purchase dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X