అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణలో మళ్లీ ముందస్తు.. కేసీఆర్

తెలంగాణలో ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. కానీ అప్పుడే ముందస్తు లెక్కలు మొదలయ్యాయి. అవును కేంద్ర మంత్రి స్వయంగా దాని గురించి కామెంట్ చేశారు. అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

కేంద్రమంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయిన సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికలపై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చని అమిత్‌షా తెలిపారు. ఈ సారి కూడా ముందుస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు కోసం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకోసమే కేసీఆర్, కేంద్రంతో యుద్ధాని రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఈసారి శాసససభ్యుల టికెట్ల విషయంలో సీఎం కేసీఆర్‌ సరికొత్తగా ముందుకువెళ్లనున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. నియోజకవర్గాల్లో శాసనసభ్యులపై ఉన్న వ్యతిరేకత టీఆర్‌ఎస్‌పై పడకుండా ఉండేందుకు సిట్టింగ్స్‌కు ఈసారి నో ఛాన్స్‌ చేప్పే అవకాశముందనే టాక్ వస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశమిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకునేలా కేసీఆర్‌ ప్లాన్ చేస్తున్నట్లు లీకులొస్తున్నాయి.

amith shah sensational comments on telangana assembly poll

టికెట్‌దక్కని సిట్టింగ్స్‌లో తమ పేరు ఉంటుందేమో అనే ఆందోళన శాసనసభ్యుల్లో రోజురోజుకీ ఎక్కువవుతున్నట్లు నియోజకవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కమలం నేతలు కూడా అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా ముందుకు పొతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌షాతో రాష్ట్ర నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+