అనసూయలో కొత్త కోణం.. ఆంజనేయస్వామి వాళ్ళ ఇంటికి వచ్చారట!
యాంకర్ గా, నటిగా ప్రస్తుతం సినిమాలలోనూ వైవిధ్యభరితమైన పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్న అనసూయ భరద్వాజ్ తాజాగా ఎమోషనల్ అయ్యారు. అనసూయ భరద్వాజ్ లో యూత్ ను ఆకట్టుకునే అంశాలే కాదు, ప్రతి ఒక్కరూ అనసూయలో ఈ కోణం కూడా ఉందా అని ఆలోచించేలా ఆధ్యాత్మికత ఉంది. తాజాగా ఆమె తన నూతన గృహప్రవేశ సమయంలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ఆంజనేయస్వామి గురించి సుదీర్ఘమైన పోస్టును పంచుకున్నారు.
మా జీవితంలో మరో కొత్త అధ్యాయం: అనసూయ
ఇటీవల తన కుటుంబంతో కలిసి నూతన గృహప్రవేశం చేసిన అనసూయ ఆ ఫోటోలను instagram వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ సీత రామాంజనేయ స్వామి కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో మా జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైందని అనసూయ గృహప్రవేశం సందర్భంగా పేర్కొన్నారు. మా కొత్త ఇంటి పేరు శ్రీరామ సంజీవని అంటూ ఫోటోలను షేర్ చేశారు.

కొత్తింట్లో అనసూయ పూజలు, హోమాలు
ఇక తమ ఇంటికి ఆంజనేయస్వామి వచ్చారని భావోద్వేగానికి గురైన అనసూయ ఈ నెల 3వ తేదీన మేము మా కొత్తింట్లో కొన్ని హోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం జరుపుకున్నాం.. చాలా కార్యాలు ఉండటం వల్ల మొదటి హోమం ప్రారంభించే ముందు మా గురువు గారితో మా ఇంటికి పేరు పెట్టాలనుకుంటున్నాం గురువు గారు అని చెప్పానన్నారు.
అంజనేయ స్వామి మా ఇంటికి: అనసూయ ఎమోషనల్
ఒక 30 సెకన్లు అలా కళ్ళు మూసుకొని ఆ తర్వాత శ్రీరామసంజీవని అని పెట్టు అన్నారు.. నేను మా ఆయన చాలా బాగుందని సంతోషించాము అని పేర్కొన్నారు. ఆ తరువాత హోమం చేయడానికి వెళ్లిన క్రమంలో ఒక 20 నిమిషాల తర్వాత మా గురువుగారు వచ్చి ఫోన్ లో ఆంజనేయస్వామి వచ్చారని చూపించారని, దాంతో నేను భావోద్వేగానికి గురయ్యాను అని పేర్కొన్నారు.
తన చిన్నప్పటి నుండి హనుమాన్ భక్తి ఉందన్న అనసూయ
తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప విషయం జై హనుమాన్ అంటూ ఆమె పేర్కొన్నారు. సంతోషంలో, విషాదంలో, భయాందోళనలో, అనారోగ్యంలో, ప్రేమలో అన్నిట్లో జైహనుమాన్ అని తలుచుకోకుండా నేనేమి చేయను అని తెలిపారు. ఆంజనేయ స్వామిని తన తండ్రి తర్వాత , తండ్రిగా భావిస్తానని, నా దగ్గరివాళ్లందరికీ తెలుసు అన్నారు అనసూయ.
హనుమాన్ తమను ఆశీర్వదించారన్న అనసూయ
అందుకే తన పెద్ద కొడుకు పేరు శౌర్య అని పెట్టుకున్నానని, అగ్నిదేవుడు ముక్కోటి దేవతలకు వార్తాహరుడు అని అంటారు.. అందుకే ఏ దేవుడికి ఏమైన గట్టిగా చెప్పుకోవాలన్న హోమం ద్వారానే చెప్పుకుంటాం.. ఈ విధంగ ఆ రోజు మా హనుమాన్ జి మా ఇంటి పేరుని, మా ఇంటిని ఆశీర్వదించాడు తెలిపారు.
సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నా అన్న అనసూయ
అందరు ఆధ్యాత్మికంగా ఉండరు.. నాకు తెలుసు.. కానీ నా సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది. అందుకే అందరికీ చెబుతున్నానని పేర్కొన్నారు."ఇందుగలడందులేడని సందేహము వలదు యెందెందు వెదకి చూసిన అందందేగలడు " అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications