అనుచిత వ్యాఖ్యలు: జగ్గారెడ్డిపై మరో కేసు నమోదు

సంగారెడ్డి: కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై బుధవారం మరో కేసు నమోదైంది. సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

అక్టోబర్ 17న సంగారెడ్డి రోడ్‌షోలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, అనుమతించిన సమయానికి మించి రోడ్‌షో నిర్వహించారంటూ జగ్గారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు ఆయనపై ఐపీసీ 504, 506 సెక్షన్లు, టీఎస్‌ ఏరియా పోలీస్‌చట్టంలోని సెక్షన్‌ 26 కింద కేసు నమోదు చేశారు.

Another case filed on Jagga Reddy for abusing words

కుటుంబ సభ్యుల పేరిట ఇతరులను అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారన్న కేసులో ఇటీవల జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మానవ అక్రమరవాణా, పాస్‌పోర్టు దుర్వినియోగం, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన కేసుల్లో పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో జగ్గారెడ్డికి జైలు శిక్ష పడింది. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాగా, టీఆర్ఎస్ పార్టీ తనపై కుట్రపూరితంగానే అక్రమ కేసులు పెడుతోందని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+