మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య: ఏం జరుగుతోందని ప్రశ్నిస్తూ కవిత ఆవేదన

నల్గొండ: గత కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, సూర్యాపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో మరో బాలిక ఆత్యహత్య చేసుకుంది. పాఠశాలకు వెళ్దామన్న రోజునే ఆత్మహత్యకు పాల్పడటంతో అనుమానాస్పదంగా మారింది. కాగా, విద్యార్థుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కవిత ప్రభుత్వం పూర్తిస్థాయిలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలంటూ ట్విట్టర్ వేదికగా కోరారు.

సూర్యాపేట మండలం ఐమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి అస్మిత (15) హైదరాబాద్​‌లో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన అస్మిత సూర్యాపేటలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుకుంటుంది. అయితే ఇటీవల వైష్ణవి మృతి నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం సెలవులు ప్రకటించింది.

another Girl stuedent Suicide in SC Residential School Suryapet

ఈ క్రమంలో హైదరాబాద్​‌లో ఉంటున్న తన తల్లి వద్దకు వెళ్లింది అస్మిత. శనివారం హాస్టల్‌​కు తిరిగి వెళ్దామని తల్లి కుమార్తెతో చెప్పి పనికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఫ్యాన్‌​కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడింది. దీంతో పాఠశాలకు వెళ్దాం అని చెప్పిన రోజే ఆత్మహత్య చేసుకోవడం అనుమానాస్పదంగా మారింది.

మృతదేహాన్ని బంధువులు స్వగ్రామమైన బుర్కచర్లకు తరలించారు. అక్కడ్నుంచి శవపరీక్ష చేసేందుకు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, అదే గురుకులంలో గత వారం ఇంటర్ విద్యార్థి వైష్ణవి అనుమానాస్పద స్థితిలో ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, అస్మిత ఆత్మహత్యపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

గత కొద్ది కాలంలోనే ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని కవిత విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిలదీశారు. పూర్తి స్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇలాంటి సమస్యలపై దృష్టి సారించలేకపోతుందని ధ్వజమెత్తారు. తక్షణమే పూర్తి స్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించి, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+