కాంగ్రెస్ వద్దు కమలమే ముద్దు: బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి డీకే అరుణ..?
Recommended Video

హైదరాబాదు: ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్‌కు షాకులు మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా ఇతరపార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే సగం మందికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారెక్కగా... మరికొందరు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన మరో బడా నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు సముచితమైన స్థానం కల్పించడం లేదన్న అసంతృప్తితో డీకే అరుణ ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈమేరకు ఆమె బీజేపీ నేత రాంమాధవ్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం రామ్‌మాధవ్ డీకే అరుణ నివాసానికి చేరుకుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. డీకే అరుణకు మహబూబ్‌నగర్ ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 45 నిమిషాల పాటు రామ్‌మాధవ్‌తో చర్చలు జరిపిన డీకే అరుణ ఆ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ఆమె రాజకీయ భవిష్యత్తుపై అమిత్ షా పూర్తి భరోసా ఇవ్వడంతో ఆ కాషాయ తీర్థం పుచ్చుకోవాలని డీకే అరుణ డిసైడ్ అన్నట్లు తెలుస్తోంది. ఇక చర్చలు సఫలం అవడంతో జాతీయ నేతలతో సమావేశం అయ్యేందుకు డీకే అరుణ ఢిల్లీ బయలు దేరి వెళ్లారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకున్న డీకే అరుణ.. గతేడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో గద్వాల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె తెలంగాణ పీసీసీ పదవిని ఆశించినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ హైకమాండ్ తనను పట్టించుకోకపోవడంతో ఆమె అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నల్గొండ సీనియర్ నాయకులు మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ కూడా బీజేపీతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఆయన కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications