video:మరోసారి.. బండి సంజయ్ వెహికిల్ చెకింగ్..
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను కొనసాగుతున్నాయి. నేతల పర్యటనలు కంటిన్యూ అవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విసృతంగా పర్యటిస్తున్నారు. ఆయనకు పోలీసులు ఆటంకం కలిగిస్తూనే ఉన్నారు. నిన్న వరసగా తనిఖీ చేయగా.. ఇవాళ కూడా మరొసారి ఆపారు.
నిన్న గంట వ్యవధిలో మూడుసార్లు బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఇవాళ కూడా లెంకలపల్లి చెక్ పోస్టు వద్ద ఆపివేశారు.వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. కారు డిక్కీలో గల వస్తువులను సోదా చేశారు. ఆ సమయంలో బండి సంజయ్ వాహనంలోనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను బండి సంజయ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Police checked my vehicle again at Lenkalapally checkpost in view of Munugode By-Election. pic.twitter.com/v5xPynQPvJ
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 25, 2022
తన వాహనాన్ని పోలీసుల మరోసారి చెక్ చేశారని బండి సంజయ్ కామెంట్ చేశారు. నిన్న బండి సంజయ్ వాహనాన్ని పుట్టపాక, చల్కెడ, తంగేడుపల్లి గ్రామాల్లో పోలీసులు తనిఖీ చేశారు. ఇవాళ లెంకలపల్లి వద్ద ఆపారు. పోలీసు మహిళా అధికారితో తనిఖీలు తప్పదా.. అని బండి సంజయ్ అడగగా.. అవును సార్ అని అనేశారు. వెహికిల్ చెక్ చేసే సమయంలో బండి సంజయ్ వాహనంలోనే ఉన్నారు.

ఇటు టీఆర్ఎస్ మాత్రం తమ ప్రభుత్వం చేసిన, చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అని చెబుతోంది. ఏం చేశామో జనాలకు తెలుసు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కూడా సరిగా ఇవ్వలేదని చెప్పారు. అన్నింటిలో తెలంగాణ ప్రభుత్వానికి అన్యాయమే జరిగిందని వివరించారు. పైగా అదీ చేశాం.. ఇదీ చేశాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రం చేస్తున్నారని మండిపడ్డారు. ఏం జరిగింది.. జరుగుతుందో జనాలకు తెలుసు అని చెప్పారు.












Click it and Unblock the Notifications