నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. అలా చేస్తే ఆత్మహత్య చేసుకుంటా: ప్రియురాలి బెదిరింపు!!

నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న ప్రియురాలు పోలీసులకు కేసు విషయంలో సహకరించటం లేదని సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఈ హత్య కేసులో ఏం జరిగింది? నవీన్ ను హరి హరకృష్ణ చంపిన తర్వాత పోలీసులకు పట్టుబడే వరకు ఏం చేశాడు? ఈ హత్యలో నవీన్ ప్రియురాలి పాత్ర కూడా ఉండే ఉంటుందని హరి హరకృష్ణ తండ్రి, ఆమెని కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది? నవీన్ ప్రియురాలు ఈ కేసులో పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తున్నారా? వంటి అనేక అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

నవీన్ మర్డర్ తర్వాత వరంగల్ కు వెళ్ళిన నిందితుడు

నవీన్ మర్డర్ తర్వాత వరంగల్ కు వెళ్ళిన నిందితుడు

ట్రయాంగిల్ క్రైం లవ్ స్టోరీగా సంచలనంగా మారిన నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణ పక్కా ప్లాన్ ప్రకారం కేవలం ప్రేమ కోసం నవీన్ ను హతమార్చారని పోలీసులు నిర్ధారించారు. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంపై హరి హరికృష్ణకు పక్కాగా అవగాహన ఉండడంతో హత్యకు అదే ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు. ఇక హత్య చేసిన అనంతరం హరి హరకృష్ణ వరంగల్లో ఉన్న తండ్రి దగ్గరకు వెళ్లాడని, అప్పటికే నవీన్ అదృశ్యం పైన వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఇక అక్కడే ఉంటే తండ్రికి తెలుస్తుంది అని భయపడిన హరి హర కృష్ణ 19వ తేదీ తెల్లవారుజామున ముసారంబాగ్ కు వచ్చేసాడని సమాచారం.

నవీన్ మర్డర్ తర్వాత ప్రియురాలికి ఫోన్..

నవీన్ మర్డర్ తర్వాత ప్రియురాలికి ఫోన్..


ఇక నవీన్ ను హతమార్చిన తర్వాత సదరు ప్రియురాలికి ఫోన్ చేసిన హరి హరకృష్ణ, నవీన్ ను హత్య చేశానని చెప్పాడని, ఆమె కూడా అతడిని పోలీసులు ముందు లొంగిపొమ్మని చెప్పిందని సమాచారం. ఇక ఈ కేసులో సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా నార్కెట్ పల్లి పోలీసులు కేసు దర్యాప్తును చేయడంతో హరి హర కృష్ణ పేరు తెర మీదకు వచ్చింది. హరి హర కృష్ణ అక్క, బావలను పోలీసులు ప్రశ్నించడంతో పరిస్థితి సీరియస్ అని భావించిన హరి హర కృష్ణ తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. దీంతో తండ్రి సూచన మేరకు అబ్దుల్లా పూర్ మెట్ లో హరి హరకృష్ణ లొంగిపోయాడు.

హత్య వెనుక మరెవరైనా ఉన్నారా? పోలీసుల దర్యాప్తు

హత్య వెనుక మరెవరైనా ఉన్నారా? పోలీసుల దర్యాప్తు


పోలీసులకు లొంగిపోయే ముందు తన ఫోన్లో ఉన్న డేటాను తొలగించాడు. ఇక అందులో ఉన్న డేటాని రికవరీ చేయడానికి పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వస్తే అతడు తొలగించిన డేటాలో ఏం కీలక విషయాలు ఉన్నాయి అన్నది తెలుస్తుంది. మరోవైపు అంత దారుణంగా నవీన్ ను హరిహర కృష్ణ ఒక్కడే చంపి ఉండడు అన్న అనుమానాలు కూడా నిందితుడి తండ్రి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ హత్య వెనుక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తనను ఇబ్బంది పెడితే సూసైడ్ చేసుకుంటా అంటున్న నవీన్ ప్రియురాలు

తనను ఇబ్బంది పెడితే సూసైడ్ చేసుకుంటా అంటున్న నవీన్ ప్రియురాలు


ఇదిలా ఉంటే హరి హర కృష్ణ తండ్రి నవీన్ ప్రియురాలి పైన కూడా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంలో నవీన్ ప్రియురాలి పాత్ర పైన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే తనను ఈ కేసులోకి లాగితే ఆత్మహత్య చేసుకుంటానని సదరు యువతి పోలీసులను బెదిరిస్తున్నారు. తనకు ఈ వివాదంతో సంబంధం లేదని తన మానాన, తనను ఉండనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులు సదరు యువతీని సఖి సెంటర్ కు తరలిస్తున్నారు. ఈ కేసులో మరింత దర్యాప్తు చేయడానికి హరి హరకృష్ణ ను పోలీసులు ఎనిమిది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కస్టడీ పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+