తెలంగాణా మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా వర్కవుట్ అవుతుందా?
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, రాజకీయ పార్టీలు ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. ప్రధాన పార్టీలు కదన రంగంలో అమీ తుమీ తేల్చుకోవటానికి రెడీ అయ్యాయి. వీలైనన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాత్మక ప్రచారాన్ని చేస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థులు
ఈ ఎన్నికల బరిలో ఏపీ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్న జనసేన పార్టీ కూడా నిలిచింది. జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుండి మున్సిపల్ ఎన్నికల బరిలోకి అభ్యర్థులను దింపారు. జనసేన పార్టీ అభ్యర్థులు అవకాశం ఇస్తే తెలంగాణాలోనూ పవన్ కళ్యాణ్ సమస్యల పరిష్కారం కోసం కృష్టి చేస్తారని ప్రచారం చేస్తూ ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నారు.

జనసేనతో పాటు ఆ పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం
తమ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు.ఈ క్రమంలో జనసేన అభ్యర్థులతో పాటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని తెలంగాణ బీజేపీ నాయకత్వం కోరింది. దీంతో ఆ విజ్ఞప్తిని జనసేన అంగీకరించింది. దీనితో జనవరి 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
నేడు పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ వెల్లడి
జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా జనసేనాని ప్రచారంలో పాల్గొంటారని జనసేన కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆయన పర్యటించే ప్రాంతాలు, పూర్తి షెడ్యూల్, రూట్ మ్యాప్‌ను ఇంకా వెల్లడించలేదు. అయితే నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇతర ఎంపీలు ముఖ్యనేతలతో చర్చించి షెడ్యూల్ వెల్లడించనున్నారు.
తెలంగాణాలో పవన్ కళ్యాణ్ చరిష్మా వర్కవుట్ అవుతుందా?
కాగా ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని వారు పవన్‌ను కోరారు. ఆ సమావేశం అనంతరం, రామచందర్ రావు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతును ప్రకటించారని, తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు అంగీకరించారన్నారు. పవన్ ప్రచారం నేపధ్యంలో పవన్ చరిష్మా ఈ ఎన్నికల్లో వర్కవుట్ అవుతుందా అన్నది ఆసక్తిగా మారింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications