తెలంగాణా మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్.. ఎందుకంటే
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేయడం మాత్రమే కాదు, జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం, బిజెపికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు అని రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ చరిష్మా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? ఇలా అనేక చర్చలు జరిగాయి.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం
ఈరోజు ఆయన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటిస్తారని భావించిన వేళ పవన్ కళ్యాణ్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ పరిణామం జనసేన, బీజేపీ అభ్యర్థులలో తీవ్ర నిరాశకు కారణమైంది.

మిత్రపక్షంగా బిజెపి ఉండడంతో ఆ పార్టీకి మద్దతు
వాస్తవానికి శని, ఆదివారాలలో ఆయన ప్రచారం చేయాల్సి ఉండగా దీనికోసం ఆయనతో బిజెపి ముఖ్య నేతలు కూడా సంప్రదింపులు జరిపారు..తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. పవన్ కళ్యాణ్ కూడా మిత్రపక్షంగా బిజెపి ఉండడంతో ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తారని అంతా భావించారు.
చివరి నిమిషంలో ప్రచారం రద్దు
ఉమ్మడి ప్రచారం చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించారు. కానీ చివరి నిమిషంలో ఆయన తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 336 వార్డులలో జనసేన పార్టీ నుంచి అభ్యర్థుల పోటీ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే కచ్చితంగా విజయం
వీరి కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుందని అభ్యర్థులు ఆశపడ్డారు. కానీ ఊహించని విధంగా ఆయన ఎన్నికల ప్రచారం రద్దు కావటంతో ఈ ప్రభావం ఏవిధంగా ఉంటుందో అని కాస్త ఆందోళనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications