విభజన అక్కసు: లెట్రిన్ డోర్లు బద్దలు కొట్టిన ఏపీ ఉద్యోగులు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి తరలిపోవాల్సిన ఉద్యోగుల్లో కొందరు పోతూ పోతూ తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. సర్వ శిక్ష అభియాన్‌కు చెందిన సుమారు 100 మంది సిబ్బంది ఏపీ రాజధాని అమరావతికి వెళ్లిపోతున్నారు.
కార్యాలయాల తరలింపులో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న సర్వ శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ప్రధాన కార్యాలయంలోని రెండో అంతస్తులో ఉన్న ఏపీ కార్యాలయాన్ని ఖాళీ చేసి అమరావతికి తరలిస్తున్నారు. కార్యాయాన్ని తరలించే క్రమంలో ఏపీ విద్యా శాఖ సిబ్బంది.. అందులోని గదులను ధ్వంసం చేశారు.
తమ వాటాకు చెందినవంటూ, తలుపులు, కిటికీలు తొలగించారు. ఇనుప చువ్వలను, కిటికీల అద్దాలనూ తరలించే ప్రయత్నం చేశారు. అక్కడున్న ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వాష్‌బేసిన్లు, ఎస్పీడీ కార్యాలయానికి ఉన్న డోర్లు, బాత్‌రూమ్ డోర్లను బద్దలు కొట్టి బీభత్సం సృష్టించారు.

విభజన అక్కసు: లెట్రిన్ డోర్లు బద్దలు కొట్టిన ఏపీ ఉద్యోగులు
ఇంటీరియర్ డెకరేషన్‌కు సంబంధించిన ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. గురువారం ఉదయం కూడా అదేవిధంగా వ్యవహరిస్తుండగా గుర్తించిన తెలంగాణ ఎస్‌ఎస్‌ఏ అధికారులు అడ్డుకున్నారు.

విభజన అక్కసు: లెట్రిన్ డోర్లు బద్దలు కొట్టిన ఏపీ ఉద్యోగులు
తమకు చెందిన రెండో అంతస్తులోని ఫైళ్లు, ఫర్నీచర్‌ను మాత్రమే ఏపీ విద్యా శాఖ సిబ్బంది తీసుకెళ్లాలి.

విభజన అక్కసు: లెట్రిన్ డోర్లు బద్దలు కొట్టిన ఏపీ ఉద్యోగులు
కానీ గదులు విధ్వంసం చేయడం, తలుపులు, కిటికీలు, అద్దాలు తొలగించడం, చివరకు ఇనుప చువ్వలు, ఇతర వస్తువులనూ తీయడాన్ని తెలంగాణ విద్యా శాఖ అధికారులు, సిబ్బంది తప్పు పడుతున్నారు.

విభజన అక్కసు: లెట్రిన్ డోర్లు బద్దలు కొట్టిన ఏపీ ఉద్యోగులు
చివరకు బాతరూమ్‌లు, లెట్రిన డోర్లు, ఎలక్ట్రికల్ వైర్లు, లైటింగ్‌నూ పీకేసి తరలించే ప్రయత్నం చేయగా తెలంగాణ ఎస్‌ఎస్ఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ భాస్కర్‌రావుతో పాటు ఉద్యోగులు అడ్డుకున్నారు.

విభజన అక్కసు: లెట్రిన్ డోర్లు బద్దలు కొట్టిన ఏపీ ఉద్యోగులు
దీంతో ఈ బీభత్సానికి పాల్పడినవారంతా వెళ్ళిపోయారని తెలంగాణ ఏఎస్పీడీ ఏ భాస్కర్‌రావు తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి ఆస్తులను తెలంగాణ, ఏపీ 42:58 నిష్పత్తి ప్రకారం పంచుకోవాల్సి ఉంటుంది. నియమాల ప్రకారం ఓ పద్ధతిగా తెలంగాణ అధికారులకు తెలిపి వారి సమక్షంలో తీసుకెళితే బాగుండేదని అంటున్నారు.

విభజన అక్కసు: లెట్రిన్ డోర్లు బద్దలు కొట్టిన ఏపీ ఉద్యోగులు
ఏపీ సర్వశిక్ష అభియాన్ కార్యాలయాన్ని తరలించిన నేపథ్యంలో బీభత్సం సృష్టించిన ఏపీ అధికారులు, సిబ్బంది తీరుపై తెలంగాణ రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులు నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.

విభజన అక్కసు: లెట్రిన్ డోర్లు బద్దలు కొట్టిన ఏపీ ఉద్యోగులు
అవసరమైతే బాధ్యులపై పోలీసు కేసులు నమోదు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖరాశామని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు.

విభజన అక్కసు: లెట్రిన్ డోర్లు బద్దలు కొట్టిన ఏపీ ఉద్యోగులు
ఇదిలా ఉంటే సర్వశిక్షా అభియాన కార్యాలయం తరలింపులో భాగంగా ధ్వంసం అయినవన్నీ పునరుద్దరిస్తామని ఏపీ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు పీఎస్ ఎంఆర్‌జి నాయుడు వెల్లడించారు.

Click it and Unblock the Notifications