కరీంనగర్‌, వైజాగ్‌లో అపోలో ఎయిర్ అంబులెన్స్ సేవలు

చెన్నై/హైదరాబాద్: అత్యవసరంగా వైద్య సేవలు అందించడానికి గతంలో ప్రారంభించిన ఎయిర్ అంబులెన్స్ సేవలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్లు ప్రముఖ వైద్యారోగ్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది.

బెంగళూరుకు చెందిన విమానయాన సంస్థ ఏవియేటర్స్ ఎయిర్ రెస్క్యూతో కలిసి నిర్వహిస్తున్న ఈ సేవలను కరీంనగర్‌తోపాటు కాకినాడ, వైజాగ్, కరైకుడి, కరూర్, మధురై, తిరుచిరాపల్లి, మైసూర్ నగరాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నట్లు అపోలో హాస్పిటల్స్ వైస్-చైర్మన్ ప్రీథా రెడ్డి తెలిపారు.

Apollo Hospitals expands air-ambulance service to Tier II

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ల ద్వారా ప్రయాణ సమయం 90 శాతం వరకు తగ్గనుండగా, అలాగే అత్యవసరంగా మెడికల్ సేవలు అందించడానికి వీలుంటుందని ఆమె వెల్లడించారు. ఇందుకోసం గంటకు రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చార్జీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.

కాగా, 2003లోనే ఎయిర్ అంబులన్స్ సర్వీసులను అపోలో హాస్పిటల్స్ ప్రారంభించింది. న్యూఢిల్లీ, బెంగూళరు లాంటి నగరాలకు మొదట విస్తరించింది. ఏడాదిలో 125-150మంది రోగులను ఈ సర్వీసుల ద్వారా చేరవేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+