సంక్రాంతికి ఊరెళ్తున్నారా? తెలంగాణా ఆర్టీసీ భారీ డిస్కౌంట్!

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్తల మీద శుభవార్తలు చెబుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికుల అవసరాలను కూడా తీరుస్తుంది. ఇక ఇదే సమయంలో ప్రైవేట్ వాహనాలకు దీటుగా సేవలు అందించడం కోసం, ప్రయాణికులపైన ఆర్థిక భారం తగ్గించడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రయాణికులకు తెలంగాణా ఆర్టీసీ బంపర్ ఆఫర్
ఎవరైతే ప్రయాణాలు చేయాలనుకునేవారు రిటన్ ప్రయాణ టికెట్లు ముందే బుక్ చేసుకుంటే మొత్తం ధర పైన 10 శాతం రాయితీని ఆర్టీసీ ప్రకటించింది. ఈ సౌకర్యం దూరప్రాంతాలకు వెళ్లే మధ్యతరగతి ప్రయాణికులకు సంక్రాంతి వంటి పండగ సమయాలలో వెళ్లి వచ్చే వారికి గొప్ప వెసులుబాటుగా ఉంటుంది. ఇది వారి ప్రయాణ ఖర్చులను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

Are you going to your hometown for Sankranthi Telangana RTC is offering a huge discount

Take a Poll

తిరుగు ప్రయాణ రాయితీ ఇస్తున్న ఆర్టీసీ
ఇప్పటికే ఆర్టీసీ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి, సేవలు అందించడంతో ఆర్టీసీ బస్సులకు మహిళలు కిటకిటలాడుతున్నారు. దీంతో సంస్థకు ఆదాయం కూడా స్థిరంగా పెరిగింది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉండటంతో మిగిలిన వర్గాలను ఆకర్షించడం కోసం 10% తిరుగు ప్రయాణ రాయితీని ప్రవేశపెట్టింది ఆర్టీసీ.

ఆర్టీసీ నిర్ణయాలతో ప్రభుత్వ రవాణా వ్యవస్థ బలోపేతం
ఈ తిరుగు ప్రయాణ రాయితీ ఆన్లైన్ పోర్టల్ తో పాటు, రిజర్వేషన్ల కౌంటర్ వద్ద అందుబాటులో ఉంది. దీనివల్ల తిరుగు ప్రయాణంలో ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయి. తెలంగాణ ఆర్టీసీని ముందుకు నడిపించడం మాత్రమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఆర్టీసీ తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వ రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.

ప్రైవేట్ వాహనాల చార్జీల భారాన్ని తగ్గించడానికి ఇదే బెస్ట్
సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం సంక్రాంతి పండుగ వేళ మంచి నిర్ణయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి 10 శాతం డిస్కౌంట్ తో బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆర్టీసీ ప్రయాణికులను తమ సేవలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. ప్రైవేట్ వాహనాల చార్జీల భారాన్ని తగ్గించడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అంటూ సూచిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+