నాడు బార్డర్లో యువకుడి పట్టివేత-ఐసిస్ కన్ను: కరీంనగర్లో నిఘా
కరీంనగర్: హైదరాబాదులో ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్ కరీంనగర్‌లో గురువారం నాడు కలకలం రేపింది. కరీంనగర్ జిల్లాకు కూడా లింక్ ఉందని తేలడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. హైదరాబాదులో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న వారిలో కరీంనగర్‌కు చెదిన యువకుడు ఉన్నట్లు తెలియడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.
కరీంనగర్‌లో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిపై రహస్యంగా నిఘా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. 2014లో కొందరు యువకులు ఐసిస్‌లో చేరడానికి వెళ్తుండగా బంగ్లాదేశ్ బార్డర్లో పట్టుబడ్డారు. అందులో ఓ యువకుడు కరీంనగర్ చెందిన వాడని తేలింది. ఆ యువకుడికి రహస్యంగా కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఆ యువకుడు తెలంగాణలో పేలుళ్లు, కాల్పులు జరిపి మారణహోమాన్ని సృష్టించాలని కుట్ర పన్నిన ఐసిస్ సభ్యుల్లో ఒకడు కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. సదరు యువకుడితో పాటు జిల్లాలో మరికొందరు ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అప్రమత్తమయ్యారు.
సదరు యువకుడి బంధువులు, స్నేహితులు సంబంధాలున్న ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచారని తెలుస్తోంది. కరీంనగర్‌లోని ఓ కుటుంబాన్ని ఎన్ఐఏ హైదరాబాద్ తీసుకువెళ్లినట్లు ప్రచారం జరిగింది. జిల్లాలోని ప్రయాణ ప్రాంగణాలు, సినిమా థియేటర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, జనావాస ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా బస్టాండుల్లోని సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications