Hyderabad: మాధవీలతపై భారీ మెజార్టీతో గెలుపొందిన అసదుద్దీన్ ఒవైసీ
ఏఐఎంఎంఎం అధినేత, ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తమ కంచుకోట హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాధవీలతపై 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. హైదరాబాద్ ప్రజలు ఆయనకే జై కొట్టారు. కాగా, దాదాపు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈ స్థానంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య గట్టి పోటీ ఉండేది.
కానీ, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఎంఐఎం, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అందుకు కారణం బీజేపీ అభ్యర్థి మాధవీ లత అని చెప్పవచ్చు. మాధవీలత తన ప్రచారంతో హైదరాబాద్ స్థానంపై చర్చలు మొదలయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నా.. వారు అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో మజ్లిస్ కంచుకోటను మాధవీ లత బద్ధలుకొట్టి.. చరిత్ర తిరగరాస్తారా? అనే చర్చ కూడా నిన్న మొన్నటి వరకూ రాజకీయ వర్గాల్లో జోరుగా నడిచింది.

ఎంఐఎంకు కంచుకోటగా మారిన హైదరాబాద్
హైదరాబాద్ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. అప్పటి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. 1984 నుంచి ఎంఐఎం గెలుస్తూ వస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలో మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పురా, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ మొదటిసారిగా 2004 ఎన్నికల్లో పోటీ చేసి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడటంతో ఆయనకు హైదరాబాద్ స్థానం కంచుకోటగా మారింది. తాజా విజయంతో హైదరాబాద్ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ భారీ విజయం సాధించడం గమనార్హం.
కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ
తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దాదాపు చెరి సగం సీట్లను దక్కించుకునేలా ఫలితాలు కనిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు కాంగ్రెస్, బీజేపీలు పలు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక,
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం.
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలు ఖాతాలో వేసుకోగా, మరో రెండింట ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే వరంగల్‌లో కడియం కావ్య 2 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీకి చెందిన ఆరూరి రమేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి సంజీవ్‌కుమార్ రెండు,మూడు స్థానాలకే పరిమితమయ్యారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవితపై 3 లక్షల 24 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు.
మరోవైపు, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి 3.5 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఆయన గెలుపొందారు. ఇక, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు మల్లు రవి (నాగర్ కర్నూల్), గడ్డం వంశీకృష్ణ(పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), కుందురు రఘువీర్ రెడ్డి (నల్గొండ), సురేష్ షెట్కార్ (జహీరాబాద్) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇది ఇలావుంటే, మల్కాజిగిరి, మెదక్, చేవెళ్ల, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications