ఎఎస్సై మోహన్ రెడ్డి ఖాకీ వడ్డీ దందా: ఆ ఇద్దరి జాడేది?
కరీంనగర్: ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందాలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న సీఐడీ కానిస్టేబుల్ పర్శరాములు గౌడ్, వసూల్ రాజా పహిల్వాన్ పర్మిందర్‌సింగ్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఫైనాన్స్ వ్యవహారంలో కేసు నమోదైన తర్వాత సీఐడీ కానిస్టేబుల్ పర్శరాములుగౌడ్‌కు సెలవు మంజూరు చేశారు. పరశురాములు గౌడ్‌ను అరెస్టు చేయకుండా సెలవుపై పంపించడంలోని ఆంతర్యమేమిటో అంతు చిక్కడం లేదు.
కాగా, మోహన్‌రెడ్డి ఫైనాన్స్ వసూళ్లకు వెళ్లే వారిలో పహిల్వాన్ పర్మిందర్‌సింగ్ కీలకమని బాధితులంతా, తమ ఫిర్యాదుల్లో స్పష్టంగా చెప్పారు. ఇప్పటి వరకు అతని ఆచూకీని సిఐడి కనిపెట్టలేకపోయింది. పోలీస్‌శాఖలో చేయి తిరిగిన రైటర్‌గా పేరు సంపాదించిన పర్శరాములుగౌడ్, ఆదినుంచీ మోహన్‌రెడ్డి వడ్డీ వ్యాపారానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకుంటూ వచ్చాడనే పేరున్నది.
బలవంతపు వసూళ్లలో ముందు వరుసలో ఉన్న పర్మిందర్‌సింగ్‌కు మోహన్‌రెడ్డి బాధితులందరూ తెలుసు. దీంతో అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరూ ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ బయటపడడానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.

దశాబ్ద కాలంగా మోహన్‌రెడ్డి బాధితులు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు మాత్రం బాధితులు రాగానే కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు మోహన్‌రెడ్డిపై ఎనిమిది కేసులు నమోదు చేసిన కరీంనగర్ వన్, టు, త్రీ, రూరల్ పోలీస్‌స్టేషన్ల పోలీసులు విచారణ కోసం కనీసం పీటీ వారంట్లు కూడా దాఖలు చేయలేదని అంటున్నారు.
2014లో తన ఇంటిని ఆక్రమించాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేస్తే మోహన్‌రెడ్డికి సమాచారం ఇచ్చి అతన్ని బలవంతంగా ఇంటి నుంచి గెంటివేయించడానికి కారకులైన పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి కూడా మోహన్‌రెడ్డిని విచారణకు తీసుకుని రాలేదు.
ఏఎస్సై మోహన్‌రెడ్డిపై సీఐడీ అధికారులు నమోదు చేసిన రెండో కేసులో బుధవారం కోర్టులో హాజరుపర్చారు. దొనపాటి వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు 25/2015 కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగళవారం ఏ4 నిందితుడు శ్రీధర్‌రెడ్డిని హాజరుపర్చిన సీఐడీ అధికారులు, ఏ1 మోహన్‌రెడ్డిని హాజరుపర్చేందుకు బుధవారం ఉదయం పిటి వా రెంట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
కరీంనగర్ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అజహర్ హుస్సే న్ అనుమతి ఇవ్వడంతో జిల్లా జైలులో ఉన్న మోహన్‌రెడ్డిని న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఈ కేసులో మోహన్‌రెడ్డికి వచ్చే నెల 1 వరకు రిమాం డ్ విధించడంతో తిరిగి జైలుకు తరలించారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications